పార్టీలు,కులాలు,మతాలకు వర్గాలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పాలనలో భవితవ్యం పై ఏర్పడిన నమ్మకం, భరోసాతోనే పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సిపిలోకి చేరుతున్నారని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు.
ఈ సందర్భంగా రాత్రి జరిగిన బీసీ ఆత్మీయ సమావేశంలో జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామం బీసీ కాలనీకి చెందిన గుంజా బిక్షం,గుంజ నరసింహారావు,గుంజ పుల్లారావు,పల్లపు నరసింహారాజు ప్రతిపక్ష టిడిపిని వీడి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను సమక్షంలో పార్టీలోకి చేరడం జరిగింది.చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ముత్తినేని విజయ శేఖర్,రూపన పుల్లయ్య,మాతంగి నాగబాబు, ఉత్తపళ్ళ వెంకటేశ్వర్లు,గుంజ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.