దశాబ్ది కాలం అవుతుంది డబుల్ బెడ్ రూం ఇవ్వక
పేదలకు ఏమి చేశారు అని దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారు
అమరుల కుటుంబాలకు ఏమి చేశారు అని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు
అటవీ హక్కుల చట్టం అమలు చేసి పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత మాది
హరిత హరం పేరుతో పేదల భూములను గుంజు కుంటున్న చరిత్ర మీది
అక్రమ అరెస్ట్ లతో మా పోరాటాలు ఆపలేరు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యములో
కెసిఆర్ చేపట్టిన దశాబ్ది ఉత్సవాలను నిరసిస్తూ ములుగు జాతీయ రహదారి పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో ధర్నా రాస్తారోకో కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన ములుగు పోలీసులు
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ మాట్లాడుతూ
దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయల ప్రజా ధనం వృద చేస్తున్నారు అని ఉండడానికి ఇల్లు లేక తర్పాలు వేసుకొని ముఖ్య మంత్రి కెసిఆర్ డబుల్ బెడ్ రూం ఇస్తాడు అని వెయ్యి కండ్లతో ఎదిరి చూస్తున్న ప్రజలకు దశాబ్ది కాలములో నిరాశే మిగిలింది అని అసెంబ్లీ సాక్షిగా కెసిఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తా అవసరం అయితే కుర్చీ వేసుకొని మీ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పడం కూడా దశాబ్ది కాలం అవుతుంది కానీ పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు దళితులకు మూడెకరాల భూమి ఇస్తా కేజీ టూ పిజి ఉచిత నిర్భంధ విద్య అమలు చేస్తా ఏక కాలంలో రైతు రుణమాఫీ చేస్తా అని ముఖ్య మంత్రి చెప్పడం దశాబ్ది
కాలం అవుతుంది కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు
మరి ఏమి సాధించారు అని కెసిఆర్ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారో మకు అర్థం కావడం లేదు అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు ప్రతి పేద వాడి నైతిక అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి గా పిలువ బడుతుంది కెసిఆర్ పాలన లో ఏ ఒక్క పేదోడి సంతోషంగా లేరు అమ్ముదం అంటే అడవి కొందాం అంటే కొరివి అన్నట్లు ఉంది రైతుల ధాన్యం కొనుగోలు చెయ్యరు కొనుగోలు చేసిన తరుగు తేమ పేరుతో క్వింటాలకు 5 నుండి 10 కేజీలు కట్ చేస్తారు ఇలా రైతులను ఇటు మిల్లర్లు దాలరులు పీల్చి పిప్పి చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రం లో ఉంది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న బి ఆర్ ఎస్ నాయకులు రైతుల భాదలు పట్టవా అని నేను అడుగుతున్న కెసిఆర్ పాలన పోవాలి కాంగ్రెస్ పాలన రావాలి
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం లోకి రావడం కోసం ఒక్క అవకాశం ఇవ్వండి ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం 5 లక్షలతో ఇండ్లు కట్టిస్తామని 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తాం రాష్ట్రం లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇచ్చి మా ప్రభుత్వం అధుకుంటుంది అని అన్నారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుచన రవళి రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొమురం ధన లక్ష్మి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,పాలడుగు వెంకట కృష్ణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి, రసుపుత్ సీతారాం నాయక్,గోవిందా రావు పేట మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,తో పాటు అనుబంధ సంఘాల మండల గ్రామ అధ్యక్షులు జిల్లా సీనియర్ నాయకులు సర్పంచులు, ఎంపీటీసీలు సహకార సంఘం చైర్మన్ లు
గ్రామ కమిటీ అధ్యక్షులు
మహిళా నాయకురాలు
సహకార సంఘం మాజీ చైర్మన్ లు మాజీ ఎంపీటీసీ సర్పంచులు, ఉప సర్పంచులు
జిల్లా,మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు