అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో గల సీనియర్ సిటిజన్ పార్క్ లో జరిగిన యోగ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రస్తుత రోజులలో యోగ అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యత కలిగినది అని, జీవనగమనంలో యోగ ది ప్రత్యేక స్థానం అని,ధ్యానం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.2015 సం. నుండి ప్రపంచ వ్యాప్తంగా యోగా వేడుకలు ఒక ప్రత్యేక నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరపు నినాదం ‘వసుదైక కుటుంబం’. ఈ జూన్ 21వ తేదీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. సంవత్సరములో అత్యధిక పగటివేళ(13 గంటల 7 నిమిషాలు) ఉండేది జూన్ 21నే. యోగా చేయడం వలన ఆయుష్షు కూడా పెరుగుతుంది కనుక జూన్ 21వ రోజును యోగా దినంగా నిర్ణయించారు.
యోగా మన ప్రాచీన సంస్కృతులలో ఒకటి. ప్రాచీన కాలంలో యోగ విద్య ఆధ్యాత్మిక కారణాల వలన పాచుర్యం పొందితే, నేటి కాలంలో ఆరోగ్య కారణాల వలన ప్రాచుర్యం పొందింది. యోగా అనగా సాధన చేయడం. ఏకాగ్రత సాధించటం. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిచుకోవడం. అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం పొందడం. యోగ సాధన శరీరము మనసు కలయికయే. యమ నియమాలు త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణా పాటించాలి. యోగా సాధనలో ఆసనాలు వేయడం వలన శరీరక దారుఢ్యం ఏర్పడుతుంది. ప్రాణాయామం వలన శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ జరిగి శరీరము చురుకుగా ఉంటుంది. ధ్యానం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. యోగా ఏ మతానికి సంబంధించినది కాదు. ఇది మన సనాతన జీవన విధానం. అందువలన అందరూ కులమతాలకు అతీతంగా యోగ సాధన చేసినట్లైతే సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు యువకులు నిత్య సాధన చేసినట్లైతే ఏకాగ్రతతో పాటు పట్టుదల, దృఢ సంకల్పం ఏర్పడి జీవితంలో వారు అనుకున్నది సాధించగలుగుతారు అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు, రాంచందర్, హిమగిరి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.