SAKSHITHA NEWS

ఫుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించండి.

  • కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

వినాయక సాగర్ వద్ద నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ ను ఆధునిక వసతులతో ఉండేలా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కరకంబాడి మార్గంలో గల వినాయక సాగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలసి నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ పరిశీలించారు. పనులు సకాలంలో జరగక పోవడం పట్ల కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సాగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదికారులను ఆదేశించారు. లాన్ లు, గార్డెనింగ్ పనులు బాగా చేయాలన్నారు.

ప్రజలకు ఇబ్బంది లేకుండా పబ్లిక్ అనౌన్స్ మెంట్ సిస్టమ్, సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఐలాండ్ వెళ్ళే మార్గంలో బారికెడ్ మధ్య ఎక్కువ గ్యాప్ ఉందని పిల్లలకు ఇబ్బందులు లేకుండా డబుల్ బారికేడ్ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్లే ఏరియా చుట్టూ రెయిలింగ్ ఏర్పాటు చేయాలన్నారు. సాగర్ లోపల ఉన్న చెత్తను తొలగించే పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ ఫూల్ పనులను పరిశీలించారు. అత్యాధునిక వసతులతో ఉండేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు. పక్కనే ఉన్న ట్రాన్స్పెర్ స్టేషన్ ను పరిశీలించి మరమ్మత్తులు త్వరగా చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం లీలామహల్ కూడలి నుండి కరకంబాడి మార్గంలో ఫుట్ పాత్ లు, డ్రెయినేజీ కాలువలను పరిశీలించారు. ఫుట్ పాత్ ల ఆక్రమణలు తొలగించాలన్నారు. అలాగే డ్రైనేజీ కాలువల పై కప్పు లేని ప్రాంతంలో గ్రిల్స్ ఏర్పాటు చేయాలన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS