SAKSHITHA NEWS

ఆధునాతన Renovated EOW కార్యాలయాన్ని ప్రారంభం*

*-ప్రారంభించిన సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్‌ రవీంద్ర, ఐపిఎస్.,*

*-ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ప్రజల అవగాహన కోసం ఆడియో వాయిస్ ఓవర్లు*

సైబరాబాద్ పోలీస్ కమీషనర్ రేట్ లో అధునాతన సౌకర్యాలతో రెనవేటెడ్ EOW  కార్యాలయాన్ని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… తీవ్రమైన ఆర్థిక నేరాలు, గొలుసుకట్టు నేరాలు, గుర్తింపులేని చిట్ ఫండ్స్ మోసాలు, వ్యవస్థీకృత ఆర్థిక నేరాలు పరిశోధించచడానికి గాను 2018 జూలై లో సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో EOW Economic Offences Wing కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.కాగా ఈ EOW కేంద్రాన్నిమరింత బలోపేతంగా మారుస్తూ ఆధునీకరించడం జరిగిందన్నారు. ఈ EOW కేంద్రం డిసిపి స్థాయి అధికారి పర్యవేక్షణ లో ఉంటుందన్నారు. వ్యవస్థీకృత ఆర్థిక నేరాల పరిశోధన త్వరితగతిన పూర్తిచేసి నేరస్థులకు శిక్ష పడేటట్టు చేసి బాధితులకు న్యాయం జరిగేల చూడాలని సీపీ తెలిపారు. వ్యవస్థీకృత ఆర్థిక నేరాలు పై ప్రజలకు అవగాహన పెంచడానికి సీపీ పత్రాలను విడుదల చేశారు. అలాగే ట్రాఫిక్ జంక్షన్ల, బస్ స్టాప్ లు తదితర రద్దీ ప్రదేశాల వద్ద పోస్టర్లు, కర పత్రాలు, ఆడియో వాయిస్ ఓవర్లతో ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., తో పాటు  సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్, ఐపీఎస్., శంషాబాద్ డిసిపి శ్రీ నారాయణ రెడ్డి, ఐపీఎస్., షీ టీమ్స్ డిసిపి శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్., బాలానగర్ డిసిపి టి. శ్రీనివాసరావు, ఐపిఎస్., సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డి‌సి‌పి శ్రీమతి రితిరాజ్, ఐ‌పీఎస్., అడ్మిన్ డిసిపి యోగేష్ గౌతమ్, ఐపీఎస్., రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ శ్రీమతి రష్మీ పెరుమాల్, ఐపీఎస్., EOW డిసిపి శ్రీమతి కవిత, రాజేంద్రనగర్ డిసిపి శ్రీ జగదీశ్వర్ రెడ్డి, మేడ్చల్ డిసిపి సందీప్, మాదాపూర్ ఏడిసిపి శ్రీ నంద్యాల నరసింహారెడ్డి, సిసిఎస్ ఏడిసిపి నరసింహారెడ్డి, ఏడిసిపి రవి కుమార్, ఏడిసిపి సిఎస్ డబ్ల్యూ వెంకట్ రెడ్డి, ఇన్ చార్జ్ ఏసీపీ పురుషోత్తమ్, ఈఓడబ్ల్యు ఇన్స్ స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS