తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి, పతాకావిష్కరణ చేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి, పతాకావిష్కరణ చేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

SAKSHITHA NEWS

తెలంగాణ స్వప్నం సాకారమై నేటికి తొమ్మిది వసంతాలు పూర్తయి, పదో వసంతంలోకి అడుగిడుతోన్న సందర్భంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమకారులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎంతోమంది అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధి పధంలో శరవేగంగా దూసుకెళ్తోంది అన్నారు.

ఒకప్పుడు కరువుతో అల్లాడిన నేల, ఉపాధి కోసం వలస బాట పట్టిన నేల, సరైన సమయానికి నీళ్లు రాక, ఈ ప్రాంతానికి దక్కాల్సిన నిధులు దక్కక, నియామకాల్లో అన్యాయానికి గురై, ఇక ఇంతేనా అనే నిరాశతో ఉన్న తెలంగాణ ప్రజలు, స్వరాష్ట్రం కోసం ఊరూ వాడా, గ్రామం పట్టణం అంతా ఏకమై పోరాడి తెలంగాణ సాధించుకున్నారు. అందరినీ ముందుండి నడిపించిన ఉద్యమ నేత శ్రీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి 9 ఏళ్లలోనే అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపారు అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు తిరుగేలేదనేలా 9 ఏళ్ల పాలన సాగింది అని గుర్తుచేశారు. అమరుల నెత్తుటి త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS
sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field