SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా పోలీస్…

🚩 వాహన దొంగతనాలలో నయా ట్రెండ్. అద్దెకు కార్లు తీసుకోవడం – ఆపై దొంగిలించి నెంబర్ మార్చడం.

👉 ట్రావెల్ కార్ల ముసుగులో అద్దె కార్ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు షేక్.మస్తాన్ వలీని అరెస్ట్ చేసిన నరసరావుపేట 1వ పట్టణ పోలీసులు.

👉 నరసరావుపేట పట్టణం, నరసరావుపేట I వ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో ది. 20.05.2023, వ తేదీ రాత్రి సమయంలో ఆరండల్ పేట లోని రైల్వే స్టేషన్ రోడ్డు లోని గాంధీ పార్కు దగ్గర AP 16 TVB 0001అను నెంబర్ TOYOTA CRYSTA కారు ను దొంగిలించుకొని పోయినట్లు నమోదు అయిన కేసు Cr.No.94/2023 U/s 420, 379 IPC గురించిన వివరాలు.

👉 ఈ దొంగతనలకు పాలుపడిన ముద్దాయి :-

ముద్దాయి వివరాలు: షేక్ మస్తాన్ వలీ, S/o మస్తాన్, A/ 44 సం,,లు, C/ H.No 8-2-603/C-67, రోడ్డు నెంబర్ 10, బంజారాహీల్స్, హైదరాబాద్, ప్రస్తుతం ఐడి బొల్లవరం గ్రామం మరియు మండలం, సంగారెడ్డి జిల్లా
దొంగతనాలకు గల కారణాలు:
షేక్ మస్తాన్ వలీ హైదరాబద్ లోని బెల్దార్ మేస్త్రి గా పని చేస్తూ, సుమారు 5 సం,,ల క్రితం ఐడి బొల్లవరం గ్రామం నందు ఒక ఇల్లు కొనుగోలు చేసినప్పటి నుండి బెల్దార్ పనులకు వెళ్లకుండా కారు ట్రావెల్స్ నందు డ్రైవర్ గా పని చేస్తూ తను కూడా కారు ట్రావెల్స్ పెట్టాలని నిర్నంచుకొని కార్లు కొనుగోలు చేయటానికి డబ్బులు లేక కార్లు దొంగతనం చేసి ఆ కార్లు తో అయిన ట్రావెల్స్ పెట్టాలి అని అనుకోని, తన వద్దకు బెల్దార్ పనికి వచ్చే వ్యక్తి వద్ద నుండి తను సెల్ ఫోన్ కావాలి అని తీసుకొని ఆ నెంబర్ నుండి జెస్ట్ డయల్ ద్వారా ఫోన్ చేసిగా జెస్ట్ డయల్ వారు విజయవాడ లోని శైలేజా కారు ట్రావెల్స్ వారి ఫోన్ నెంబర్ ఇవ్వగా ఈ కేసులోని నిండుతుడు జెస్ట్ డయల్ వారు ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ది 20.05.2023 వ తేదీన ఫోన్ చేసి తన పేరు తన పేరు V.S రావు అని తనకు నాలుగు రోజులు కారు కావాలి అని అడగడం జరిగినది.

👉 20.05.2023 రోజున నన్ను గన్నవరం ఎయిర్ పోర్టు వద్దకు వచ్చి పికప్ చేసుకోమని మని చెప్పగా, అందుకు నిండుతుడు చెప్పిన మాటలు నమ్మిన కారు ఓనర్ కారు బాడుగ క్రింద 24 గంటలకు గాను 7500/ రూపాయలు మరియు 500 రూపాయలు డ్రైవర్ బెటా క్రింద మాట్లాడి షాజీత్ అనే డ్రైవర్ తో AP 16 TVB 0001 అను నెంబర్ TOYOTA CRYSTA అను కారు పంపుగా కారు డ్రైవర్ నిండుతుదడిని గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఎక్కించుకొని రాత్రి సుమారు 9.45 గంటలకు నరసరావుపేట రైల్వే స్టేషన్ రోడ్డు లోని గాంధీ పార్కు వద్దకు రావడం జరిగినది.

👉 నిండుతుడు కారు అపి డ్రైవర్ ను ఇక్కడ దగ్గరలో ఏదైనా రెస్టాడెంట్ వుంటే బిర్యానీ తీసుకొని రమ్మని చెప్పగా, అతను నిండుతుడు చెప్పిన మాటలు నమ్మిన షాజీత్ అను డ్రైవర్ బిర్యానీ తీసుకొని రావటానికి వెళ్ళగా కేసులోని నిండుతుడు కారు తో వెళ్ళిపోయి. ఆ కారు కు వున్న AP 16 TVB 0001అను నెంబర్ కు బదులుగా AP 35 AF 4465 నెంబర్ గా మార్చి తిరుగుతూ వున్నాడు.

👉 ఈ రోజు అనగా ది 27.05.2023 వతేదీన ఉదయం 10.00 గంటలకు ముద్దాయి గుర్తించి నరసరావుపేట పట్టణం, వినుకొండ రోడ్డు లోని 60 అడుగుల రోడ్డు వద్ద అరెస్టు చేసి, AP 16 TVB 0001అను నెంబర్ కు మార్చి AP 35 AF 4465 నెంబర్ పెట్టుకొని వున్న కారు ని అతని వద్ద నుండి స్వాధీన పరుచుకోవటం అయినది.
👉 ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవి శంకర్ రెడ్డి ఐపీఎస్ గారు మాట్లాడుతూ…
ముద్దాయి అయిన షేక్ మస్తాన్ వలీ గతంలో ట్రావెల్స్ నందు డ్రైవర్ గా పనిచేసినట్లు సొంతగా ట్రావెల్స్ పెడదామనే ఉద్దేశంతో సదరు దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. సదరు ముద్దాయిని త్వరగా పట్టుకునేందుకు నరసరావుపేట డిఎస్పి గారికి ఆదేశాలు ఇవ్వగా డిఎస్పీ గారు రెండు టీములు ఏర్పాటు చేసి హైదరాబాదు పంపి పల్నాడు జిల్లా ఐటీ కోర్ విభాగం ద్వారా మరియు హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి CAT app ద్వారా ముద్దాయి సమాచారాన్ని సేకరించి ముద్దాయిని గుర్తించి కేవలం 5 రోజులలో ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుండి INNOVA CRYSTA కారుని స్వాధీనపరచుకోవడం జరిగిందని ముద్దాయి ని అరెస్టు చేసి దొంగిలించబడిన కారు ను కరికవరీ చేసిన నరసరావుపేట I వ పట్టణం సి. ఐ, ఎ.అశోక్ కుమార్, మరియు నరసరావుపేట II టౌన్ సి ఐ, P వీరేంద్రబాబు, SI ఎన్.వెంకటేశ్వరరావు, వారి సిబ్బంది V.శంకరయ్య, CH. వీరాంజనేయులు, K. తిరుమలరావు, హోంగార్డ్ సైదా మరియు ఐటీ కోర్ విభాగం నుండి హెడ్ కానిస్టేబుల్ శ్రీను లకు Cash రివార్డ్ లను ఇచ్చి అభినందించారు.


SAKSHITHA NEWS