SAKSHITHA NEWS

చెరువు శిఖం భూమిని ఆక్రమించిన ఇంటూరి హరగోపాల్ పై చర్యలు తీసుకోవాలి

మా భూమిలో వరద కాలువ తవ్వి వేధింపులకు గురి చేస్తున్న హరగోపాల్, తహసిల్దార్ లపై చర్యలు తీసుకోవాలి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

చెరువు శిఖం భూమిని ఆక్రమించి పామాయిల్ సాగు చేయడమే కాకుండా తన భూమిలోకి వచ్చి వరద వరద కాలువను తవ్వించి వేధింపులకు పాల్పడుతున్న ఖమ్మం మెడికల్ ఏజెన్సీ, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి హరగోపాల్ పై చర్యలు తీసుకోవాలని ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన చింతిరాల లక్ష్మీనారాయణ వేడుకున్నారు.
శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కొండాపురం రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 101 లో గత 60 సంవత్సరాలుగా సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. మా పక్కనే ఉన్న భూమి చెరుశిఖంను ఇంటూరి హరగోపాల్ ఆక్రమించి ఫామాయిల్ సాగు చేశాడని, మా భూమి నుండి వరద కాలమును తవ్వించాడని ఇదే అంశంపై పలుమార్లు హరిగోపాల్ దృష్టికి, రూరల్ మండల తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేకపోగా, మా భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే సామాజిక వర్గం కావడంతో తహసిల్దార్ ను అడ్డుపెట్టుకొని మాపై కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఏకపక్షధోరణినితో తహసీల్దార్ వ్యవహరిస్తున్నాడని ఆరోపించాడు. సర్వే నెంబర్ 95లో చెరువు శిఖం భూమిని హరగోపాల్ కబ్జా చేస్తే అతనిపై చర్యలు తీసుకోకుండా, మాపై వారిరువురు కలిసి వేధింపులకు పాల్పడడం ఎంతవరకు న్యాయమని అన్నారు. వారిరువురి నుండి మాకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఈ విలేకరుల సమావేశంలో నవీన్, ఉపేందర్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS