SAKSHITHA NEWS

ఘనంగా బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవం

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని గ్రామదేవతలైన కట్ట మైసమ్మ, కోట మైసమ్మ, బొడ్రాయి, శ్రీ రేణుక ఎల్లమ్మ పండుగ మొదటి వార్షికోత్సవాన్ని కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు బొడ్రాయికి నీళ్లు పోసి
పూజా కార్యక్రమాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామ ప్రజలను సంరక్షించే పొలిమేర దేవతలను పూజించుకోవడం శుభమని గ్రామ నిర్మాణంలో పవిత్రంగా భావించే ఆది దేవుడి ప్రతిరూపం నాబిశిల(బొడ్రాయి) అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి జలంధర్ రెడ్డి, విద్యా కమిటీ వైస్ చైర్మన్ నీలకంఠం నరేష్, ఎంపిటిసి నీతారమణారెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు పొట్లపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS