SAKSHITHA NEWS

ఎన్టీఆర్ మెచ్చిన నాయకుడు సిరికొండ మధుసూదనా చారి.

రవీంద్ర భారతిలో ఎన్టీఆర్ స్ఫూర్తి పురస్కారాన్ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అందుకోవడం జరిగింది. సామాజికoగా రాజకీయoగా తన జీవితంలో తనదైన ముద్రవేసిన నందమూరి తారక రామారావు ఎంతో మందిని ప్రభావితం చేసిన మహానుభావుడని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ప్రజల బాగు కోసం ఉపయోగపడే నిర్ణయం వేగంగా తీసుకునే వారని తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని జాతీయస్థాయిలో నిలబెట్టారని ఆయన అడుగుజాడల్లో ఇప్పుడు సిరికొండ మధుసూదనా చారి నడవడం మన తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తనలాంటివారు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.

ఇటీవల రవీంద్ర భారతిలో జరిగిన ఎన్టీఆర్, కృష్ణ, దాసరి జయంతి వేడుకలను నిర్వహించారు. ఎన్టీఆర్ స్ఫూర్తి పురస్కారం అందుకున్న సిరికొండ మధుసూదనా చారి గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తి పురస్కారo అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నాడు ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడిచి, నీతి నిజాయితీగల నాయకుడిగా ఆయన ఎలాగైతే పేరు తెచ్చుకున్నాడో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గర్వించే నాయకుడిగా పేరు రావడం ఎన్టీఆర్ స్ఫూర్తి పురస్కారం అందుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాధికారాన్ని అందించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. కుల రాజకీయాలు తనకు నచ్చవని ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లో రాణిస్తున్నానని అన్నారు. నా రాజకీయ గురువు ఎన్టీఆర్ పేరిట పురస్కార అందుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. అంత గొప్ప మహానుభావుడి అడుగుజాడల్లో నడిచి నేను రాజకీయం రంగంలో ప్రజల మన్ననలు పొంది నేటికీ సిరికొండ మధుసూదన చారి అంటేనే ప్రజలు గర్వించే విధంగా ముందుకు సాగుతున్నానని ఆవేదన భరితంగా అన్నారు.

నాకు రాజకీయ గురువు ఎన్టీఆర్ అయితే, నాకు ఎమ్మెల్యేగా పదవి అప్పగించి తెలంగాణ తొలి సభాపతిగా నిలబెట్టిన నా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు అంటే నాకు ఎనలేని ప్రాణమని ఆయన అన్నారు. అందుకే నేను ఇప్పటికీ కులాల మతాలకు రాజకీయ పార్టీల గతీతంగా భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలుపుకుపోతూ వారి కష్టసుఖాల్లో నేటికీ పాలుపంచుకుంటూ ఆయూ ఆరోగ్యాలతో ఉంటున్నానని, నా నియోజకవర్గ ప్రజలు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని నిత్యం ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.

ఇప్పటికీ భూపాలపల్లి నియోజకవర్గంలో గడపగడపకు మీ నాయకుడు ఎవరు.? అని ఎవరైనా ప్రశ్నిస్తే మా నాయకుడు సిరికొండ అని గర్వంగా ప్రతి గడపగడపకు చెప్పుకుంటున్నారు. అంతకన్నా అదృష్టం నాకు ఏమీ కావాలని ఆవేదన భరితంగా అన్నారు. రాజకీయ రణరంగంలో పదవులతో పనిలేదని, పేదలే నా ప్రాణం అంటూ పేదల కోసమే అహర్నిశలు కృషి చేస్తున్న వారిని ప్రజలు ఎల్లప్పుడూ మరవరని, గతంలో ఇదే స్ఫూర్తితో ఎన్టీఆర్ ముందుకు నడిచి అంత గొప్ప మహా నాయకుడు అయ్యాడని ఆ స్ఫూర్తితోనే భూపాలపల్లి నియోజకవర్గంలో నేను కూడా ఆయన స్ఫూర్తి పురస్కారం అందుకోవడం నా అదృష్టమని ఆయన అన్నారు.

ఎండనకా వాననకా, రాత్రి అనకా, పగలనకా కష్టపడిన నాయకులు కార్యకర్తలకూ ధన్యవాదములు తెలుపుతూ, భూపాలపల్లి నియోజకవర్గంలో నాకు ఓట్లు వేసి గెలిపించి తెలంగాణ తొలి సభాపతిగా చేసిన నా ప్రజలకు 24 గంటలు సేవ చేయాలనే నా మనసు ఆరాటపడుతుందని నేను హైదరాబాదులో పడుకున్నా గాని నా నియోజకవర్గం నాకళ్ళల్లో కదులుతూ ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటికీ భూపాలపల్లి పరిసర ప్రాంతాల్లోకి అడుగుపెట్టగానే నా హృదయం ద్రవించి పోతుందని, నా ఆనందాలకు అవధులు ఉండవని, నా ప్రజలు ఎక్కడ కనిపించినా గానీ వారిని పలకరిస్తేనే గాని నా మనసు కుదుట పడదని, అలాగే ప్రజలు కూడా నన్ను కలుస్తూ నాకు వారు ఇచ్చే గౌరవం అంతా ఇంతా కాదన్నారు.

అందుకే ఎన్టీఆర్ స్ఫూర్తి పురస్కారం భూపాలల్లి నియోజకవర్గంలోని నా అక్క చెల్లి తల్లి సోదరీ సోదరీమణులందరికీ ప్రతీ ఒక్కరికి అంకితమిస్తున్నానన్నారు. నేను తిన్న తినకపోయినా భూపాలపల్లి నియోజకవర్గంలోని నా ప్రజలను కలుసుకుంటే చాలు నాకు కడుపు నిండుతుందని ఆవేదన భరితంగా అన్నారు. మీరు నమ్మిన నమ్మక పోయినా ఇది మాత్రం అక్షర సత్యం భూపాలపల్లి నియోజకవర్గంలో కరెంటు పోతే చాలు నా కళ్ళు తెరుచుకుంటాయి నా హృదయంలో చీకట్లు కమ్ముకుంటాయి అది ప్రజలు నా మీద చూపిస్తున్న అభిమానానికి ఆ వెలుతురు చీకట్లే సాక్ష్యం అన్నారు.

నాకు భూపాలపల్లిలో గుడిసె ఉందా.? గుడిసెల్లో నివసించే వారికి డబుల్ బెడ్ రూములు కట్టించిన తర్వాతనే నేను ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాను అంతలోనే విధి నాపై ఎందుకు కపట ప్రేమ చూపించిందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలుసు నాకు గుంట భూమి కూడా లేదని అక్రమ సంపాదన లేదని నీతి నిజాయితీగా పాలించానని, చాలా ఇండ్లలో నిద్రలు చేశానని, ఎందరో ఇండ్లలో భోజనం చేశానని, భూపాలపల్లి జిల్లాగా చేశానని వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని అదే నాకు సంతృప్తి, నాకు భూపాలపల్లిలో గుడిసె లేకున్నా పర్వాలేదు అని ఆయన అన్నారు. ప్రజలకు నీతివంతమైన పాలనను అందించాను కనుకనే నాపై నియోజకవర్గంలోని ప్రతి మనిషి అంత ప్రేమ చూపించడం అంతకన్నా నాకు అదృష్టం ఏమి కావాలని అన్నారు.

నేను ఏ నియోజకవర్గంలో లేని విధంగా అభివృద్ధి చేసి చూపించానని నేను ఇది చేశానని నేను ఎప్పుడు చెప్పుకోలేదని నేను ఏది చేసినా నా ప్రజల సహాయకారులతో చేశానని సంతృప్తి పడ్డానని నేను చేప్పకుండా చేశానని, ఇది నేను చేశానని ఎప్పుడు చెప్పుకోలేదని, ఇదంతా ప్రజాభీష్టం మేరకు, ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దానని ఆయన గుర్తు చేశారు. నేను గతంలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగే క్రమంలో భూపాలపల్లిని ఏ రకంగా తీర్చిదిద్దానో ప్రతి ఒక్కరికి తెలుసునని అన్నారు. పదవిలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తే, ఆ విమర్శలను స్వీకరించి ఆ సమస్యలను పరిష్కరించే కోసము కృషి చేసిన వాడే నాయకుడు ఆ కోవలోనే నేను ప్రతిపక్షంలో ఉన్నవారు విమర్శిస్తే వాటిని సరిదిద్దుకొని పోయిన ఘనత నాదేనని ప్రజలకు తెలుసునన్నారు.

అనూహ్యంగా నేను ఓటమి చెందిన తరువాత నియోజకవర్గంలోని ప్రజలకు కన్నీళ్లు వచ్చాయన్న సంగతి కూడా నాకు తెలుసు మీకు తెలుసు మన అందరికీ తెలుసు అంత కీర్తిని సంపాదించుకున్న నాకు ఎన్టీఆర్ స్ఫూర్తి పురస్కారం రావడం అంటే నా నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేనూ భావిస్తున్నానన్నారు. నేను భూపాలపల్లి నియోజకవర్గంలో పలు శుభ ఆశుభ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు నన్ను చూసి ఆనందపడే వారి సంఖ్య పెరిగిందన్నారు. అంత గౌరవాన్ని చూపుతున్న నా ప్రజలకు నేను ఇంకా సేవ చేయాలనే ఆలోచన నా హృదయాంతరాల్లో నుండి వస్తుందన్నారు. అందుకే ప్రజలు రావాలి మదన్నా, రావాలి మదన్నా అంటూ స్వాగతాంజలు పలుకుతున్నారని గుర్తు చేశారు.

వారి స్వాగతాలు స్వీకరించి వారి సేవలో తిరిగి తరించాలని ఇంకా ఎంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రజల ఆకాంక్ష మేరకే భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతి కుటుంబ కష్టసుఖాల్లో పాలుపoచుకుంటున్నాననీ ఆయన అన్నారు. వారి కోరిక మేరకే భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలు ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చినా గాని తూచా తప్పకుండా స్వీకరించి ఎల్లవేళలా వారికి సేవ చేస్తానని ఎన్టీఆర్ స్ఫూర్తి పురస్కారం అందుకున్న సందర్భంగా ఆవేదన భరితంగా సిరికొండ మధుసూదన చారి గారు అన్నారు.


SAKSHITHA NEWS