SAKSHITHA NEWS

సాక్షిత : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమల ప్రసన్న నగర్ కాలనీ లో రూ. 10,00,000/- పది లక్షల రూపాయల అంచనా వ్యయం తో ఎమ్మెల్యే (CDP FUNDS ) నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజాదేవి రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కమల ప్రసన్న నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే  సీడీపీ ఫండ్స్   10 ,00 ,000 పది లక్షల రూపాయలను ఎమ్మెల్యే (CDP FUNDS ) నుండి 10 లక్షల రూపాయలు మంజూరి చేయడం జరిగినది అని భవనం ను త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి  అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం అని ,కమ్యూనిటీ హాల్ ను కాలనీ సంక్షేమం ,అభివృద్ధి కోసం చక్కగా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ లో సమావేశాలు, సభలు, చిన్న చిన్న ఫంక్షన్ లు , జన్మదిన వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా భవనం నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కాలనీ అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తానని ,మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధం అని ,ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి వచ్చిన పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .వివేకానంద నగర్ డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయ షెక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ సందర్బంగా  కాలనీ వాసులు  మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే కమ్యూనిటీ హాల్ నిర్మాణం కు నిధులు కేటాయించి , ప్రారంభించుకోవడం చాలా సంతోష్కారంగా ఉంది అని దీనికి సహకరించిన ఎమ్మెల్యే గాంధీ కి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని ,అదేవిధంగా ఎమ్మెల్యే గాంధీ   శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని  కొనియాడారు .

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు,చంద్రమోహన్ సాగర్ ,కమల ప్రసన్న నగర్ కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ శేఖర్ ,వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, జనరల్ సెక్రెటరీ శ్రీశైలం గౌడ్,బండప్ప, శంకర్, వెంకటేష్, అడ్వైజర్ రాఘవులు, రాము, కాలనీ వాసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS