సాక్షిత :వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్””మీతో నేను” కార్యక్రమంలో భాగంగా ధారూర్ గ్రామపంచాయతీ పరిధిలోని తిమ్మనగర్ మరియు లక్ష్మినగర్ తండా లో పర్యటించారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికై ప్రత్యేక ప్రణాళికతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తూ… తెలంగాణ గ్రామాలకు మహర్దశ తీసుకువచ్చిందన్నారు.
గ్రామాల్లో రోడ్లు, మురుగు
కాలువల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.
తిమ్మనగర్ మరియు లక్ష్మినగర్ తండాలో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని, రోడ్ల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను పక్కకు వేయాలని, ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని, గ్రామంలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని, విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ కచ్చితంగా ఇవ్వాలని, ప్రజలు ఎవ్వరు కూడా నల్లాలకు చెర్రలు తీయరాదని, నల్లాలకు కచ్చితంగా ట్యాప్ లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సురక్షితమైన మిషన్ భగీరథ మంచినీటిని ప్రజలందరూ త్రాగాలని, అందుకు అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు.
ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని వాడుకలో ఉంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.