ప్రకాశం జిల్లా
అర్హుల ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు
– 96వరోజు కొమరోలులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు
-ఎమ్మెల్యే అన్నాకు హరతులతో స్వాగతం పలికిన ప్రజలు
-మండుటెండనూ సైతం లెక్కచేయకుండా ఆరుపదుల వయస్సులోనూ ప్రతి గడప లోని సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే అన్నా
-ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో పలుకరిస్తూ ముందుకు సాగిన ఎమ్మెల్యే అన్నా
………………………………
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను అర్హుల ఇంటి ముంగిటకే అందచేస్తున్నామని ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు అన్నారు. ఉదయం కొమరోలు మండలంలోని కొమరోలు -3, సాయంత్రం హనుమంత రాయునిపల్లి గ్రామాల్లో నిర్వహించిన 96 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు పాల్గొన్నారు. ముందుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ప్రతి వీధిలో మహిళలు ఎమ్మెల్యే అన్నా కు హరతులతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా ఆయా వీధుల్లోని ప్రతి గడప – గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించి మూడేళ్ళ పాలనలో అందించిన సంక్షేమ బుక్ లను అందించి ప్రభుత్వ పథకాల లబ్దిని వివరించడం జరిగింది. అనంతరం ఆయా వీధుల్లో స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మండుటెండనూ కూడా లెక్కచేయకుండా ఆరుపదుల వయస్సులోనూ ప్రజా సమస్యలు ఎమ్మెల్యే అన్నా తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా ప్రతి ఇంటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరించారు. అవ్వా పింఛన్ అందుతుందా… అక్కా చేయూత డబ్బులు పడ్డాయా…ఆసరా డబ్బులు పడ్డాయా…. అంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో పలుకరిస్తూ ముందుకు సాగారు. అనంతరం రాబోయే రోజుల్లో మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపీ ముఖ్య నేతలు,జడ్పీటీసీలు,ఎంపీటీసీలు,సర్పంచ్ లు,వైసీపీ నాయకులు,కార్యకర్తలు, అధికారులు,సచివాలయ సిబ్బంది, గృహ సారదులు, వాలంటీర్లు పాల్గొన్నారు.