SAKSHITHA NEWS

సాక్షిత : నేరాల నియంత్రణకు, నేరాల పరిశోధనకు సీసీ కెమెరాలు పాత్ర కీలకమైనది:బాపట్ల జిల్లా ఎస్పీ *
నేరాల నియంత్రణకు, నేరాల పరిశోధనకు సీసీ కెమెరాలు పాత్ర కీలకమైనదని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ తెలిపారు. పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను ఉదయం జిల్లా ఎస్పీ ప్రారంభించారు.


పర్చూరులోని బొమ్మల సెంటర్, వై జంక్షన్, అర్.టి.సి బస్టాండ్, ఉప్పుటూరు బ్రిడ్జి, జాగర్లమూడి రోడ్డు, నాగులపాలెం మరియు ఇతర పలు ప్రదేశాలలో 30 రోజుల బ్యాక్అప్ కలిగిన, 5 మెగా పిక్సెల్ హెచ్.డి క్వాలిటీ వున్న 32 నైట్ విజన్ సీసీ కెమెరాలను దాతల సహకారంతో పర్చూరు ఎస్సై ఎన్.సి.ప్రసాద్ ఏర్పాటు చేశారు. వీటిని పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేసినారు. ప్రస్తుతం పూర్తి స్థాయి సీసీ కెమెరాల నిఘాలో పర్చూరు మండల కేంద్రం ఉన్నది. ఉదయం జిల్లా ఎస్పీ పర్చూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించి, వాటి పనితీరును పరిశీలించారు. అనంతరం జిల్లా ఎస్పీ సీసీ కెమెరాల దాతలను ఘనంగా శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో నేరాలు జరుగుతున్న తీరు, నేరస్తులు నేరం చేసే విదానాలు అనేక విధాలుగా ఉంటున్నాయన్నారు. వాటిని చేదించడం పోలీస్ శాఖకు సవాలుగా మారుతుందన్నారు. ఏదైనా నేరం జరగకుండా ముందుగానే నియంత్రించలన్న లేదా నేరం జరిగిన తర్వాత సంబంధిత నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాలు, కూడళ్ళు, రద్దీ ప్రదేశాలలో నేరాలు జరగకుండా ఉండాలంటే ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండటం ఎంతో ఉపయోగమన్నారు. పోలీస్ స్టేషన్ ల పరిధిలో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పరిశీలించడం వలన ముందస్తుగా నేరాలు జరగకుండా నియంత్రచవచ్చునన్నారు. అంతేకాకుండా నేరం జరిగిన తర్వాత కూడా నిందితుల కదలికలను, నిందితులు ఎవరనేది తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. దాతల సహకారంతో పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 32 సీసీ కెమరాలు అమర్చడం జరిగిందని, వాటిని పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చెయ్యడం వలన పర్చూరు మండల కేంద్రం పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల నిఘలో ఉన్నదన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో నేరస్తులు నేరాలు చెయ్యడానికి బయపడతారని, మహిళలకు, వ్యాపారస్తులకి భద్రత పెరుగుతుందని తెలిపారు.

ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, వాటితో 24 గంటలు నిఘా ఉంటుందని, దుకాణాల వద్ద, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే పటిష్టమైన భద్రత వారికి లభిస్తుందని, ముఖ్యంగా ఒంటరిగా ఉండే మహిళలల ఇంటి పరిసరాల్లో, రద్దీగా ఉండే వ్యాపార సముదాయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు బాపట్ల డిఎస్పి ఏ.శ్రీనివాసరావు , మార్టూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్.టి.ఫిరోజ్ , ఎస్.బి ఇన్స్పెక్టర్ ఏ.శ్రీనివాస్ , పర్చూరు ఎస్సై ఎన్.సి.ప్రసాద్ , మార్టూరు ఎస్సై కమలాకర్ , ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు దాతలు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 04 21 at 2.35.27 PM

SAKSHITHA NEWS