SAKSHITHA NEWS

సాక్షిత : క్షేత్ర స్థాయిలో పోలీసు శాఖ ప్రతినిధులుగా మహిళా పోలీసుల సేవలు అభినందనీయం: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐ.పి.ఎస్.,
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మార్చి నెలల్లో వార్డ్ మహిళా పోలీసుల G. మౌనిక విధి నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరచిన మహిళా పోలీసులను ప్రత్యేకంగా అభినందించి వారికి ప్రశంసా పత్రాలు అందచేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే అంశాలు, బాల్య వివాహాలు నివారణ, ఈవ్ టీజింగ్, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యక్రమాల గురించి క్షేత్ర స్థాయిలో ఆరా తీసి ఉన్నతాధికారులకు సమాచారమివ్వడం, ప్రజలకు సీసీ కెమెరాలు ఆవశ్యకతను వివరించి ఇన్స్టలేషన్ చేయించటం, నంబర్ ప్లేట్ వాహనాలు, పోలీస్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లు లేని ఆటోలను గుర్తించడం, కొత్త వ్యక్తుల యొక్క సమాచారాన్ని సేకరించటం, దిశ యాప్ డౌన్లోడ్ చేయించడం, సైబర్ క్రైమ్ మరియు జాబ్ మోసాలపై మీద అవగాహన కల్పించడం మొదలైన విధుల్లో చురుగ్గా పనిచేసినందుకు నెలలో టాప్-5 మహిళా పోలీసులలు
మార్చి నెలలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన టాప్-5 గ్రామ/వార్డ్ మహిళా పోలీసులు

  1. G. మౌనిక, గిద్దలూరు పీఎస్.
  2. M. స్వర్ణ లత, పొన్నలూరు పీఎస్.
  3. S. అశ్విని, గిద్దలూరు పీఎస్.
  4. V. రేణుక, గిద్దలూరు పీఎస్.
  5. E. జయకమల, మార్కాపూర్ టౌన్ పీఎస్.
    గుర్తించి అభినందించడం జరిగిందన్నారు.

SAKSHITHA NEWS