యర్రగొండపాలెం (మండలం) :
బోయలపల్లి పంచాయతీ లోని గ్రామ సచివాలయానికి ఇరవై నెలలుగా
అద్దె చెల్లించకుండా వినియోగించుకుంటున్న నేపథ్యంలో తీవ్ర అసహనానికి గురైన భవన యజమాని గజ్జల చెన్నయ్య సచివాలయానికి తాళం వేసి తన నిరసనను వ్యక్తం చేశారు.. ఈ సంఘటనను తెలుసుకున్న ఎంపీడీవో మరియు ఎమ్మార్వో అక్కడికి చేరుకొని… యజమానిని పిలిపించి వివరములు అడగగా… తన పరిస్థితి బాగాలేదని కూలి పనులకు వెళ్తే గాని కుటుంబ పోషణ జరగటం లేదని… మా ఆడవాళ్ళకి ఆరోగ్యం బాగోలేక ఇరుగుపొరుగు వారి దగ్గర అప్పు చేసి మరి వైద్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని… ఎన్నోసార్లు సర్పంచ్ ను మరియు పంచాయతీ కార్యదర్శిని అద్దె చెల్లింపు విషయమై వివరణ అడగ్గా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో… విసుగు చెంది వేరే దారి లేక సచివాలయానికి తాళం వేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అనంతరం ఎమ్మార్వో రవీంద్రారెడ్డి చెన్నయ్య కి అద్దె చెల్లింపుల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వడంతో… సచివాలయ తాళాలు తెరుచుకున్నాయి…
గ్రామ సచివాలయానికి తాళం వేసిన యజమాని…
Related Posts
ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన?
SAKSHITHA NEWS ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన? ఏపీలో ప్రధాని మోదీ ఈ నెల 29న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి.అనకాపల్లి సమీపంలోని పూడిమడక లో ఎన్టీపీసీ తలపెట్టిన గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో…
వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు
SAKSHITHA NEWS వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు? అమరావతి: ప్రముఖ నటుడు,వైసీపీ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించిన నేత,నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం…