సాక్షిత ప్రతినిధి : తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల చెరువుల కాలువల కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవికాలంలో పాఠశాలలు కళాశాలలకు సెలవులు కావడంతో ఎంతోమంది పిల్లలు యువకులు, ఎండ వేడి నుంచి సేద తీరడానికి ఈత నేర్చుకోవడానికి జలాశయాల వద్దకు ఈతకు వెళ్లే అవకాశాలు ఉన్నందున ఇట్టి క్రమంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరుగుతుండడం వలన అందరూ ఇట్టి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా కాని విషాదం కాకూడదని కల్వకుర్తి ఎస్ఐ ఏ రమేష్ అన్నారు.ఈత రానివారు బావులు చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఈతను నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల చెరువుల కాలువల కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందు ముందు పోలీస్ శాఖ.ప్రజా ప్రతినిధుల సహాయ సహకారాలతో జలాశయాల వద్ద హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేసి రానున్న కాలంలో ఎటువంటి ప్రమాదాలు జరిగి ప్రాణా నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.