SAKSHITHA NEWS

సాక్షిత : * వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్” “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల కేంద్రంలో ఉదయం 06:30 AM నుండి 12:30 PM వరకు పర్యటించారు.
గ్రామంలోని ఇళ్ల మధ్యలో పెంట కుప్పలు, పిచ్చిమొక్కలు మరియు పాడు బడ్డ ఇళ్ళు ఉండటంతో పల్లె ప్రగతిలో ఏం చేశారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామాన్ని ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ, ప్రతిరోజూ చెత్త సేకరణ చేయాలన్నారు.
ప్రజాప్రతినిధులు మరియు అధికారులు సమన్వయంతో పని చేస్తూ… గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చి, సరిపడా నీటిని అందించాలని, ఎక్కడ కూడా మిషన్ భగీరథ పైపు లీకేజీలు లేకుండా, వెంట వెంటనే పైపు లీకేజీలను సరిచేస్తూ… మంచి నీటిని సరఫరా చేయాలన్నారు.


సురక్షితమైన మిషన్ భగీరథ మంచినీటిని ప్రజలందరూ త్రాగాలని, అందుకు అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు.
ధారూర్ గ్రామంలో థర్డ్ వైర్ మరియు ఫిఫ్త్ వైర్ ఏర్పాటు చేయాలని, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని, అవసరమైన చోట నూతన స్థంబాలు ఏర్పాటు చేసి, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడు కృషి చేయాలని విద్యుత్ శాఖ వారిని ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన రైతుబంధు పథకం ద్వారా ధారూర్ మండల కేంద్రానికి చెందిన రైతులకు ఇప్పటివరకు 10 కోట్ల పైచిలుకు రావడం జరిగిందన్నారు.
గ్రామంలో ఇప్పటివరకు మరణించిన 16 మంది రైతుల యెక్క కుటుంబాలకు రైతుబంధు పథకం ద్వారా 80 లక్షలు రావడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS