SAKSHITHA NEWS

గుర్రంపోడు (సాక్షిత ప్రతినిధి)

గుర్రంపోడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జన ఆరోగ్య సమితి కమిటీని ప్రభుత్వ ఆదేశానుసారం ఎంపిక చేయడం జరిగింది. జన ఆరోగ్య సమితి కమిటీ చైర్మన్ గా గుర్రంపోడు ఎంపీపీ మంచి కంటి వెంకటేశ్వర్లు, డిఎంహెచ్ వో కో చైర్ పర్సన్ గా కొండల్ రావు, సభా కార్యదర్శిగా
వైద్యాధికారి భవాని చక్రవర్తి, సభ్యులుగా జడ్పిటిసి గాలి సరిత రవికుమార్,ఎంపీడీవో శ్రీపాద సుధాకర్,తహసిల్దార్ హుస్సేన్,సర్పంచ్ షేక్ మస్రత్ సయ్యద్ మియా లని నియమించడం జరిగింది.
చైర్మన్ హోదాలో ఎంపీపీ మంచి కంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గుర్రంపోడు మండలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున మండల ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలి తప్ప ఎండలో తిరిగి వడదెబ్బకు గురి కావద్దని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సిబ్బంది కొరత ఉన్నదని ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లగా డిఎం హెచ్ వో, శాసనసభ్యులు నోముల భగత్ ల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీపాద సుధాకర్, విద్యాధికారి భవాని చక్రవర్తి,మోడల్ స్కూల్ ప్రిన్సిపల్,అంగన్వాడీ టీచర్లు, డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.


SAKSHITHA NEWS