SAKSHITHA NEWS

సుదర్శన క్రియతో ఆరోగ్యం మెరుగవుతుంది

సాక్షిత నల్లగొండ జిల్లా

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో హ్యాపీనెస్, సుదర్శన క్రియ, యోగ, మెడిటేషన్ కార్యక్రమాలని ప్రారంభించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాసరావు గురూజీ చే సుదర్శన్ క్రియ యోగ మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శ్రీనివాస్ రావు గురూజీ మాట్లాడుతూ జీవితం ఆనందదాయకంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు సుదర్శన క్రియ ప్రతినిత్యం చేయాలన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ఒత్తిడిని పారదోలి ఆచరణాత్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుంది అన్నారు, ధ్యానం మరియు ఉఛ్వాస నీశ్వాసలను చక్కగా పొందుతారని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి ఆనందం, ఆరోగ్యం కావాలంటే తప్పనిసరిగా సుదర్శన్ క్రియ చేయాలని దీని ద్వారా మన మనసు మన ఆధీనంలో ఉంటూ మన శ్వాస ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోగలమని తెలియజేశారు. శ్వాసను పట్టుకో ఆరోగ్యాన్ని పెంచుకో జీవితం ఆనందదాయకంగా ఉంటుందన్నారు. సుదర్శన క్రియ ద్వారా శారీరక మరియు మానసిక బలహీనత నుండి విముక్తి పొందుతారని, వ్యక్తిగత సంబంధాలను పెంపొందించుకుంటారని, రక్త పోటు, మధు మొహం, ఉబ్బసం మొదలగు రోగాలను అరికట్టవచ్చని, గుండె జబ్బులు, పక్షపాతం, మైగ్రేన్, సైనసైటిస్, చర్మవ్యాధులు గ్యాస్టిక్ సమస్యలు మరియు ఎన్నో ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ప్రపంచవ్యాప్తంగా 186 దేశాల లోని అన్ని వర్గాలవారు 45 మిలియన్ ప్రజలకు దీని ద్వారా గొప్ప ప్రయోజనాలను పొందారన్నారు. ఈ కార్యక్రమంలో యోగా టీచర్ కిషోర్, పొట్లపల్లి నరసింహ, నూతి వెంకటేశం, నీలకంఠం నరేష్, మైల సత్తయ్య, నారాయణ రమేష్, జీ.నాగచారి, సత్తిరెడ్డి, చంద్రయ్య, యాదయ్య, ఆనగంటి లింగస్వామి, మోర ధనుంజయ్, గుండెబోయిన నరసింహ, మర్రి హరీష్ రెడ్డి, కాటం సందీప్ యాదవ్, సిద్ధ గాని అశోక్, వెంకన్న, ఉయ్యాల లింగస్వామి, రాచమల్ల శ్రీనివాస్, మాధగొని లింగస్వామి, బెలిజ పరమేష్, పాకాల సత్యనారాయణ, సిలువేరు వెంకటేష్, నూతి విశ్వతేజ, ఈరటి తేజ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS