చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
జూనియర్ పంచాయతీ సెక్రటరీలు తమ సర్వీస్ ని క్రమబద్ధీకరించాలని కోరుతూ ఎంపీడీవో లాజర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కార్యదర్శులు మాట్లాడుతూ ఈ రోజుతో నాలుగు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ కాలాన్ని పూర్తి చేసుకున్నామని
ఈ కాలాన్ని సర్వీస్ గా పరిగణిస్తూ ప్రభుత్వం వెంటనే జిఓ విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనుల్ని విజయవంతంగా నిర్వహించడంలో, అలాగే తాజాగా కేంద్రం ప్రకటించిన జాతీయస్థాయి పంచాయితీ అవార్డులలో తెలంగాణ రాష్ట్రానికి 8 అవార్డులు దక్కాయి అంటే అది కేవలం పంచాయతీ కార్యదర్శుల కృషి మాత్రమే అని అన్నారు.
వచ్చే రెండు వారాల సమయంలో జెపిఎస్ ల క్రమబద్దీకరణ చేయని యెడల ఈ నెల 28 తేదీ నుండి సమ్మె కు వెళ్తామని పంచాయితీ కార్యదర్శులు తెలియపర్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ పద్మ అన్ని గ్రామ పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరుతున్న జేపియస్ లు
Related Posts
సిసీయస్ ఏసీపీగా భాధ్యతలు స్వీకరించిన యండి.సర్వర్
SAKSHITHA NEWS సిసీయస్ ఏసీపీగా భాధ్యతలు స్వీకరించిన యండి.సర్వర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; ఖమ్మం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సీసీఎస్ ఏసీపీగా యండి.సర్వర్ భాధ్యతలు స్వీకరించారు. ఆనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని…
ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి
SAKSHITHA NEWS ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి ప్రజావాణిలో అర్జీలను స్వీకరించిన అదనపు కలెక్టర్ లు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ప్రజావాణి అర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్…