SAKSHITHA NEWS

రామన్నపేట (సాక్షిత ప్రతినిధి)

కెసిఆర్ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. శోబానాద్రిపురం గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో
ఎంపీపీ కన్నేబోయిన జ్యోతి బలరాం యాదవ్, జెడ్పిటిసి పున్నా లక్ష్మీ జగన్మోహన్, సింగల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ ముక్కాముల నరేందర్, బిఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గంగుల రాఘవరెడ్డి,
పంచాయతీరాజ్ ఏఈ గాలయ్య, మాజీ సర్పంచ్ బొడిగె శ్రీనివాస్, వార్డ్ మెంబర్ రషీద్, కల శ్రీలత కంచి శోభ,
పంచాయతీ కార్యదర్శి ఆమనగంటి నరేష్, నాయకులు ముక్కామల సత్తయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS