మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వెల్లడి.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మైలవరం సచివాలయం-4 పరిధిలో సంక్షేమానికి రూ.23,93,01,167లను వెచ్చించినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
మైలవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఇందులో రూ.10,20,53,167లు నేరుగా సంక్షేమ పథకాల అమలుకు నేరుగా పేదలకు చెల్లించినట్లు వెల్లడించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం కింద ఇళ్లస్థలాలు, గృహనిర్మాణం కోసం రూ.13,60,50,000లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. సీఎం జగనన్న పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మైలవరం సచివాలయం-4 పరిధిలో సంక్షేమానికి రూ.23.93కోట్లు
Related Posts
ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన?
SAKSHITHA NEWS ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన? ఏపీలో ప్రధాని మోదీ ఈ నెల 29న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి.అనకాపల్లి సమీపంలోని పూడిమడక లో ఎన్టీపీసీ తలపెట్టిన గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో…
వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు
SAKSHITHA NEWS వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు? అమరావతి: ప్రముఖ నటుడు,వైసీపీ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించిన నేత,నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం…