SAKSHITHA NEWS

మహబూబ్ నగర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నట రాజ్ కు కరోనా వారియర్ అవార్డు వరించింది. కోవిడ్ -19, కోవిడ్ సెకండ్ వెవ్ సమయాల్లో విశిష్ట సేవలందించిన లయన్ నటరాజ్ విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో హైదారాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యా లయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహా దారులు యం.వి.రమణ, విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ సి ఈ ఓ సత్యవోలు రాం బాబు, విశ్రాంత ఐ ఎ ఎస్ అధికారి లక్ష్మీ కాంతం, లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ లయన్ ప్రేమ్ కుమార్, గొట్టి పాటి సత్య వాణిల చేతుల మీదుగా కరోనా వారియర్ అవార్డు ను అందుకున్నారు. కో విడ్ సమయంలో ప్రాణాలకు లెక్క చేయకుండా కరోనా బాధితులకు నటరాజు విశేషమైన సేవలందిo చారు. కరోనా ను అరికట్టేందకు తీసుకోవాల్సిన జాగ్రతలపై అవ గాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేశారు. కరోనా తో మృతి చెందిన వారితో పాటు మొత్తం 47 మంది గుర్తు తెలియని వ్యక్తుల భౌతిక కాయలకు దహన సంస్కారాలు నిర్వహించడంలో నట రాజు తన దైన శైలిలో సేవలందించారు. ఈ క్రమంలో కరోనా బారిన పడి కోలు కున్న నటరాజు అనంతరం అనేక పర్యాయాలు రక్త దానం చేయడమే కాకుండా కరోనా బాధితులకు ప్లాస్మా దానం చేసి ప్రాణ దాతగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. కరోనా లో అద్భుతమైన సేవలందించిన నటరాజు విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో కరోనా వారియర్ అవార్డు ప్రదానం చేయడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.


SAKSHITHA NEWS