SAKSHITHA NEWS

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

చిట్యాల(సాక్షిత ప్రతినిధి)

చిట్యాల పట్టణంలోని శివాలయ ప్రాంగణంలో
సీతారాముల కళ్యాణాన్ని కన్నల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా అండకానికి తీసుకువచ్చారు. చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి రజిత కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు తలంబ్రాలను సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ రంగా వెంకన్న ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ అర్చకతత్వంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరయ్యారు. ఆలయ ప్రాంగణమంతా రామనామ స్మరణతో మార్మోగింది. వేసవికాలం దృష్ట్యా భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, ఆలయకమిటీ చైర్మన్ రంగా వెంకన్న, స్థానిక కౌన్సిలర్ గోధుమ గడ్డ పద్మ జలంధర్ రెడ్డి, కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, పందిరి గీతా రమేష్, సిలివేరు మౌనిక శేఖర్, రేముడాల లింగస్వామి, నాయకులు వనమా వెంకటేశ్వర్లు, జిట్ట బొందయ్య, దాసరి నరసింహ, గంట్లా శ్రీనివాస్ రెడ్డి, వివిధ హోదాలలో ఉన్న నాయకులు
భక్తులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS