చంద్రబాబు ఆశీస్సులతో 2024 లో ఎరిక్షన్ బాబు సారధ్యంలో నియోజకవర్గం లో పచ్చ జెండా ఎగరటం పక్కా…
చంద్రబాబు ఆశీస్సులతో
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమితులై 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పార్టీ లో తనదైన ముద్ర వేశారు. సీనియర్ నాయకులు మన్నే రవీంద్ర తోపాటు ఇద్దరు ముగ్గురు నాయకులు తనని వ్యతిరేకిస్తున్న వారి విషయం అధిష్టానం చూసుకుంటుందని, తాను మాత్రం నియోజకవర్గం లోని అందరి నాయకులను కార్యకర్తలను ఏకాతాటిపై నడిపిస్తూ అధిష్టానం నిర్దేశించిన బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ లాంటి కార్యక్రమాలతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. నియోజకవర్గం లోని నాయకుల కార్యకర్తల ఇంటా జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అందరికి దగ్గరవుతున్నాడు. దీంతో అధిష్టానం దగ్గర నియోజకవర్గం లోను మంచి పనితీరు కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పక్రియ మొదలైనప్పటి నుండి నియోజకవర్గ క్యాడర్ తోపాటు యువకులకు ఎప్పటి కప్పుడు విలువైన సూచనలు చేస్తూ, పట్టభద్రులను ఓటర్లుగా చేర్చటం దగ్గర నుండి ఐదు మండలాల్లో ప్రచారం నిర్వహించిన విధానం అదేవిధంగా ఆ ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు రాబట్టిన తీరు, రాజకీయ వర్గాల వారిని తన గురించి ఆలోచించేలా చేసింది. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ లో ఎరిక్షన్ బాబు కు ముందు ఆయన వచ్చిన తరువాత అనేలా నాయకులు కార్యకర్తలు మాట్లాడుకునేలా పార్టీలో మార్పులు జరిగాయి. నిబద్ధత తో పార్టీ సేవ చేసే నాయకులకు కార్యకర్తలకు నిజమైన గుర్తింపు ఎరిక్షన్ బాబు సారధ్యంలో లోనే పురుడు పోసుకుంది అని భావించిన తెలుగు తమ్ముళ్ళు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ గురించి నియోజకవర్గ ప్రజలు ఆలోచించేలా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎదురైన అపజయాలకు స్వస్తి పలికి ఎరిక్షన్ బాబు సారధ్యంలో విజయంతో నియోజకవర్గ తలరాతను మార్చాలని నాయకులు కార్యకర్తలు పట్టుదలతో ఉన్నారు.