సర్వేలన్నీ మనకే అనుకూలం.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: సీఎం కేసీఆర్
హైదరాబాద్: భారాస అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగింది. ఎన్నికల ఏడాది దృష్ట్యా పలు అంశాలపై అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు..
పాదయాత్రలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, నేతలంతా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్న సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు పార్టీ సమావేశంలో పాల్గొన్నారు..