వెంకటాచలం మండల కేంద్రము,
సర్వేపల్లి నియోజక వర్గము.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా తమ్ముడు “శ్యామ్”ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. – వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి .
సాక్షిత : వెంకటాచలం మండలములోని ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఉన్న శ్రిడ్స్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యూలు కాకాణి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వేపల్లి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి .*
కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సమయం తక్కువగా ఉందని, సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల JCS కన్వీనర్లు వారి వారి మండలాలలోని సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులతో ఆయా పంచాయతీలలోని నాయకుల పర్యవేక్షణలో ప్రతి ఒక్క ఓటరు నేరుగా మూడుసార్లు కలిసి ఓటును అభ్యర్థించాలని తెలిపారు. 2014, 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో నా గెలుపు కోసం శ్యామ్ కష్టపడి పనిచేసి నా విజయంలో కీలక భూమిక పోషించాడని, అతన్ని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరితో పాటుగా నాకు ఉందని, నేను కూడా ఈ వారం రోజులు పాటు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను ఎన్నికల తేది నాటికి రప్పించాలని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యదిక మెజారిటీ తీసుకురావాలని నియోజకవర్గ ముఖ్య నాయకులను, కార్యకర్తలను కోరారు.
శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి నాకు అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తూ, పార్టీలో నా ఎదుగుదలకు తోడ్పడుతున్న మా అన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలని, ఈనెల 13వ తేదీ జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ నమూనాలో రెండవ సీరియల్ నంబరులో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నా పేరు ఎదురుగా మొదటి ప్రాధాన్యత – 1 ఓటువేసి నన్ను ఆశీర్వదించాలని కోరారు.