SAKSHITHA NEWS

చందానగర్ డివిజన్ పరిధిలోని సత్యనారాయణ ఎనక్లేవ్ కాలనీ లో రూ.172.25లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న నాల విస్తరణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని అసంపూర్తిగా మిగిలిపోయిన నాల విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు అదేవిధంగా మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ, నాల విస్తరణ పనులు నాణ్యత ప్రమాణాల తో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీపడకూడదని, పనులలో వేగం పెంచాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా నాలలకు రక్షణ చర్యలలో భాగంగా ఫెన్సింగ్ వేయాలని, రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, పెండింగ్ పనులలో ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలనీ చెప్పడం జరిగినది .గత వర్షాకాలంలో నాలా పొంగి ప్రవహించడం ద్వారా ఇండ్లలోకి నీరు ప్రవహించి ,పరిసరాలు నీటమునిగిన పరిస్థితి  విదితమే దీనిని దృష్టిలో పెట్టుకొని మళ్లీ పునరావృతం కాకుండా పనులు చేపట్టామని ,నాలా లో పేరుకుపోయిన చెత్త, మట్టిని  పూడిక తీత ద్వారా తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా  ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని, అధికారులు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదిల్ పటేల్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS