సాక్షిత : హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో గల విద్య వాణి హై స్కూల్ నిర్వహించిన Quest EXpo 2023 విజ్ఞానశాస్త్ర ప్రదర్శన ( సైన్స్ ఫెయిర్) ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి,తిలకించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ విద్య వాణి హై స్కూల్ లో నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శన విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారి ప్రతిభ కు పదును పెట్టడానికి ఈ ప్రదర్శన ఎంతగానో తోడ్పడుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.విద్యార్థులు చేసిన సాంకేతిక ,సాంస్కృతిక, పర్యావరణ ప్రాజెక్టులను తిలకించి విద్యార్థులు ను ప్రత్యేకంగా అభినదించి ఎంతగానో మెచ్చుకున్నారు. చిన్నారులలో దాగి ఉన్న సృజనాత్మక ను బయటకు తెచ్చేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతాయి అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
విజ్ఞానశాస్త్ర ప్రాజెక్ట్ ఫలితాలను నివేదిక, ప్రదర్శన బోర్డు, నమూనాల రూపంలో ప్రదర్శించే ఒక పోటీ. విజ్ఞానశాస్త్ర ప్రదర్శనలు విద్యార్థులు సంవత్సరమంతా చేసిన పనిని ప్రదర్శించడానికి అవకాశం కల్పించే ఒక చక్కటి వేదిక అని, ఇది విద్యార్థులలో ప్రేరణ కల్పిస్తుంది, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిని తెలుసుకునే పరిపుష్టిగా (feed back) ఉంటుంది. విద్యార్థులు తాము చేసిన పనిని ఇతరులతో పంచుకోవడం వల్ల ఆ భావనలపై అవగాహన పెరుగుతుంది. అనేక నమూనాల ప్రదర్శనను చూచిన విద్యార్థులకు తాముకూడ ఇలాంటి ప్రదర్శనలో భాగస్వాములు కావాలన్న భావన కలుగుతుంది.
ఇది సందర్శించిన వారికి విజ్ఞానశాస్త్రం ఏమిచేయగలదో అర్థమవుతుంది అని.ఎగ్జిబిషన్ కంటెంట్‌లో భాగంగా పరిశోధనలోని పదార్థాలు, సాధనాలు నమూనాలను నేపథ్యము విజ్ఞానశాస్త్ర ప్రదర్శన ముందు ఆకర్షణీయంగా ప్రదర్శించవచ్చు. ప్రదర్శించిన విషయం పరిశోధన సమయంలో విద్యార్థులు కృషి చేసిన అంశాలను కలిగి ఉంటుంది. ఇది పరిశోధన పనుల పరిధిని, ఒక ప్రయోగంలో జరిగిన సంఘటనల వివరాలను చూపుతుంది. ప్రదర్శించబడిన కంటెంట్‌తో, సైన్స్ ఎగ్జిబిషన్‌ను చూసే సందర్శకులు విద్యార్థులు చేసిన పని యొక్క దృడమైన, సంభావిత దృష్టాంతాన్ని కలిగి ఉంటారు అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ప్రదర్శనకు విచ్చేసిన తల్లిదండ్రులు, విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను చూసి ఆనందం వ్యక్తం పరిచారు.
ఈ కార్యక్రమంలో , విద్య వాణి హై స్కూల్ పాఠశాల యాజమాన్యం చైర్మన్ అనిల్ కుమార్, ఉష రాణి , ఉపాధ్యాయులు, విద్యార్థులు ,తల్లిదండ్రులు, మరియు హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ ,హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ తదితరులు పాల్గొన్నారు