SAKSHITHA NEWS

పాఠశాల పిల్లలకు వీధి కుక్కల పట్ల ప్రవర్తించాల్సిన తీరుపై అవగాహన సదస్సు

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని షంషీగూడ ప్రభుత్వ పాఠశాలలో జిహెచ్ఎంసి వెటర్నరీ డిపార్ట్మెంట్ మరియు జిహెచ్ఎంసి ఎంటమాలజి డిపార్ట్మెంట్ వార్ల సహకారంతో పాఠశాల పిల్లలకు వీధి కుక్కల నుండి రక్షణ కొరకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఇటీవల అంబర్ పెట్ లో జరిగిన దురదృష్ట సంఘటనను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పిల్లలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు పాఠశాలకు వచ్చేటప్పుడు మరియు తిరిగి వెళుతున్నప్పుడు కూడా వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి వీధి కుక్కల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించాలని తెలిపారు.

ఎవరైనా కుక్క కాటుకు గురైతే వెంటనే తల్లిదండ్రులకు గాని ఉపాధ్యాయులకు గాని తెలియజేసి వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు. వెటర్నరీ డాక్టర్ లింగస్వామి మాట్లాడుతూ డివిజన్ లోని పలు కుక్కలను పట్టుకుని వాటికి ఆపరేషన్ చేసి మరియు అవి కరిచిన గాని రూబీస్ వ్యాధి ప్రమాదం లేకుండా వ్యాక్సిన్ ఇంజక్షన్ కూడా ఇచ్చి మళ్లీ అదే ప్రాంతంలో వదిలిపెడుతున్నామని అన్నారు. అటువంటి కుక్కలకు చెవి దగ్గర వి షేప్ ఆకారంలో కట్ మార్క్ ఉండడం గమనించవచ్చు అని తెలియజేశారు.

అలాగే వీధి కుక్కల వల్ల ఎటువంటి ఇబ్బంది ఎదురైనా 040-2111 1111 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా ‘కుక్క కాటు నివారణ పద్ధతులు మరియు వీధి కుక్కల పట్ల ప్రవర్తించాల్సిన తీరుపై సూచనలు’ ఉన్న కరపత్రాలను అందరికీ అందించడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు నరసింహులు, సిద్దయ్య, పోశెట్టిగౌడ్, వాసుదేవరావు, హైస్కూల్ ప్రిన్సిపాల్ పి.నాగజ్యోతి, ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ అనురాధ మరియు ఉపాధ్యాయ బృందం, ఎంటమాలజి సూపర్వైజర్ డి.నరసింహులు మరియు ఎంటమాలజి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS