SAKSHITHA NEWS

Radhotsavam of Sri Ishtakameshwari Shambulingeswara Swami as the festival of eyes

సాక్షిత : మహాశివరాత్రి జాతరని పురస్కరించుకొని మేళ్లచెరువులోని ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామిని ఎమ్మెల్యే సైదిరెడ్డి తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ *

కన్నుల పండుగగా శ్రీ ఇష్టకమేశ్వరి శంభులింగేశ్వర స్వామి వారి రధోత్సవం

సంస్కృతి సాంప్రదాయాలకు ఎడ్ల పందాలు ప్రతీక

*ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్ , శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి *

మహాశివరాత్రి జాతరని మేళ్లచెరువులోని ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి జాతర సందర్భంగా జాతీయస్థాయి ఎడ్ల బండ లాగుడు ప్రదర్శనను నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిలుగా *కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి * హాజరై ఎడ్ల పందా లు ప్రారంభించారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న గెలిచిన వారికి బహుమతి ప్రధానోత్సవం చేశారు.


సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… జాతరల్లో ఎడ్ల పందాలు నిర్వహించడం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి సంప్రదాయం అన్నారు.రైతుల్లో ఆనందోత్సావాలు ,కోడెల పెంపకం లో ఆసక్తి పెంచేందుకు ఈ పోటీలు దోహదపడుతాయన్నారు.ఐదో తారీకు నుండి జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామని, పెద్ద ఎత్తున జాతరకు తరలి రావాలన్నారు. కాగా ఎడ్ల పందేల్లో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభూలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరి కోరికలు ఆ పరమశివుడు తీర్చాలని ఆకాంక్షించారు….


SAKSHITHA NEWS