We recognize every worker who works: Vikarabad District, BRS Party President, MLA
పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపునిస్తాం: వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *
సాక్షిత : వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో, వికారాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మరియు వారి అనుచరులు ప్రవీణ్, వినోద్, నరేష్, మురళి, ప్రశాంత్, నరేష్, మహేష్ కాంగ్రెస్ పార్టీ నుండి BRS పార్టీలో చేరారు.
నూతనంగా పార్టీలో చేరిన యువనాయకులకు BRS పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తూ… శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.