SAKSHITHA NEWS

Jagananne is our future program from 20th of this month.

ఈ నెల 20 నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం..
సీఎం జగన్ ప్రత్యేక సమావేశం

ఏపీలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. అధికార పార్టీ నేతలు.. ప్రజల ముందుకు వెళ్ళడానికి.. తాము అధికారంలోకి వచ్చిన అనంతరం చేసిన అభివృద్ధి పనులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చేసిన విధానాన్ని ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళడానికి వైఎస్సార్‌సీపీ నేతలు రెడీ అవుతున్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరింత జోరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళడానికి కార్యాచరణ రూపొందించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేసినవి, ప్రజలందరికీ అందజేసిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకుని వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 20 నుంచి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకా­లంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ మేరకు మధ్యాహ్నం 3.30 కి సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే లు, ఇంఛార్జీలు, ఎమ్మెల్సీ లు, పరిశీలకులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై ప్రధానంగా చర్చించనున్నారు. గృహ సారథుల నియామకానికి సంబంధించిన తుది జాబితాను ఎమ్మెల్యేలు సమర్పించనున్నారు.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని 15 వేల సచివాలయాల్లో ఈ నెల 27 వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. మ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలందరూ తమ నియోజకవర్గాల్లో పత్రికా సమావేశాలు నిర్వ­హించి, కనీసం 25 నుంచి 30 ఇళ్లకు తిరిగి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

వాలంటీర్ల తో కలిని గృహ సారథులు ఇళ్లను సందర్శించనున్నారు. సచివా­లయం కన్వీనర్లు, గృహ సారథులు, గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ తిరిగి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు.


SAKSHITHA NEWS