The second phase of Kanti Velam program at Police Kalyanamandapam
పోలీస్ కళ్యాణమండపం లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంలో భాగంగా
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని పోలీస్ కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ ప్రారంభించారు. పోలీస్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి కంటి పరీక్షలు చేయించుకుని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఉచితంగా అందజేసే కళ్ళజోళ్లను పొందాలని తెలియజేసారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సుమారుగా 150 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు .ఈ కార్యక్రమం ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ బి. మాలతి, అడిషనల్ డీసీపీ(ఏ అర్) కుమారస్వామి, ఎస్ బి ఎ సి పి ప్రసన్న కుమార్, అర్ ఇ శ్రీనివాస్, సాంబశివరావు, సీఐ సత్యనారాయణ రెడ్డి చిట్టిబాబు, యూనిట్ హాస్పిటల్ డాక్టర్ జితేందర్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.