![WhatsApp Image 2023 02 06 at 5.22.43 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-06-at-5.22.43-PM-300x300.jpeg)
During the BRS government, Finance Minister Harish Rao gave priority to the welfare of the poor
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు
సాక్షిత : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి దిశగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ని అసెంబ్లీలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్ తో కలిసి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. బీసీలు, షెడ్యూల్ కులాల వారికి వేల కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టారన్నారు.
సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించేలా రూపొందించారన్నారు. మెట్రో రైల్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని అలాగే దళిత బంధు, రైతుకు రుణమాఫీ, వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పులిమామిడి రాజుగారు, టిఎంఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీను, టిఎంఎంఎస్ ప్రధనకార్యదర్శి అల్లుడు జగన్, తదితరులు పాల్గొన్నారు
![during the](https://sakshithanews.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-06-at-5.22.43-PM-1024x683.jpeg)