SAKSHITHA NEWS

Corrupt Somireddy.. you talk…

అవినీతిపరుడైన సోమిరెడ్డి.. నువ్వు మాట్లాడటం
సాక్షిత : అవాస్తవాలు చెప్పేందుకు సిగ్గు శరం ఉండాలి*

2024లో సోమిరెడ్డిని తరిమికొట్టడం ఖాయం!

అబద్ధాల చెప్పడమే పనిగా పెట్టుకున్న మాజీమంత్రి టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

నెల్లూరు నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సోమిరెడ్డి ఆరోపణలకు దీటైన జవాబు ఇచ్చారు. బండేపల్లి- డేగపూడి కాల సంబంధించి సోమిరెడ్డికి పలు ప్రశ్నలు వేసి సవాల్ విసిరారు.


సోమిరెడ్డి నోరు తెరిస్తే అవినీతి అబద్దాల కంపు
డేగపూడి-బండేపల్లి కాలువ పై సోమిరెడ్డి మాటలను చూసి ప్రజలు యావగించుకుంటున్నారు.
డేగపూడి-బండేపల్లి కాల్వకు సంబంధించి 2019 ఎన్నికలకు ముందు హడావిడిగా ప్రారంభించాడు.
ఒక చీఫ్ ఇంజనీర్ మురళి నాథ్ రెడ్డి ద్వారా లేఖ రాయించాడు.

26 కోట్లు వ్యయం చేసే ఈ పనిని టెండర్ తో కాకుండా నామినేషన్ తో అప్పగించేందుకు అప్పట్లో కుట్ర పన్నారు.
డేగపూడి-బండేపల్లి కెనాల్ కు సంబంధించి నామినేషన్ పద్ధతిలో కేటాయించేందుకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమ్యామ్యాలతో ఇంట్రెస్ట్ చూపారు
దీనిపై అప్పట్లో ఆందోళన చేస్తే 11 శాతం లెస్ తో పనులను కాంట్రాక్టుకు పిలిచారు
2018లో పనులు ప్రారంభమైతే అప్పుడు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారని మంత్రి కాకాని ప్రశ్నించారు


ఇచ్చిన కాంటాక్ట్ ను రద్దుచేసి మరో సంస్థకు అప్పగించారు.
వెంకటగిరి నియోజకవర్గం నుంచి ప్రజలను అరువు తెచ్చుకొని వైసిపి ప్రభుత్వం పై దుష్ప్రచారం చేసేందుకు కుట్ర
భూసేకరణకు సంబంధించి పొదలకూరు మండలంలో అధికారులు ప్రకటించిన నష్టపరిహారం పై ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న నేను చివరి వరకు పోరాటం చేశా
డేగపూడి బండేపల్లి కెనాలకు సంబంధించి పది కోట్ల రూపాయలు మంజూరు చేసేమని సోమిరెడ్డి చెప్తున్నారని ఇది పూర్తి అవాస్తమన్నారు


ఈ కాలువ పనులకు సంబంధించి టిడిపి హయంలో అది కోట్ల రూపాయలు కాదు కదా ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు
సర్వేపల్లి ప్రజలు ఎన్నిసార్లు సోమిరెడ్డికి గుణపాఠం నేర్పిన ఆయన తీరులో మార్పు రావడం లేదన్నారు
26 కోట్ల పనులను నామినేషన్ పద్ధతి ద్వారా ఇవ్వాలనుకొన్నారు
అవినీతికి పాల్పడ్డ సోమిరెడ్డే నీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం
రైతుల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని బండేపల్లి డేగపూడి కాలువకు కొత్త రూపు తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నాం


సోమిరెడ్డి తీరు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుంది.
అవినీతిపరుడు కాబట్టే సర్వేపల్లిలో సోమిరెడ్డి ని నాలుగుసార్లు ఓడించారు
నీ అవినీతి పై ప్రమాణానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా..!
దమ్ము, ధైర్యం ఉంటే నీ ఆరోపణలకు ఆధారాలు చూపించు.
వైఎస్సార్సీపీ ఫై కొంతమంది పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు.
టీడీపీ ఒక అబద్దాల పుట్ట అని ప్రజలకు బాగా తెలుసు.


అభివృద్ధి ఎవరి హయాం లో జరిగిందో చర్చిద్దాం… రండి.
టీడీపీ ది అవినీతి పాలన, వైఎస్సార్సీపీ ది సంక్షేమ పాలన
రైతులకు వాస్తవాలు తెలియాలని మీడియా ముందుకు వస్తున్నా.
సోమిరెడ్డి లాంటి అబద్దాలకోరు మాటలను నమ్మకండి.
ఎవరి బలమెంతో 2024 ఎన్నికల్లో తేల్చుకొందాం.


SAKSHITHA NEWS