Live Etcherla MLA said that the government’s mission is to provide welfare schemes
నిరుపేదలందరికీ కుల,మత,రాజకీయలకు అతీతంగా సంక్షేమ పథ కాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని లక్ష్మీ పురం గ్రామంలో మంగళవారం సర్పంచ్ కొల్లి ఎల్లమ్మ, సర్పంచ్ ప్రతినిధి ఈశ్వర్ రెడ్డి,ఎంపిటిసి కాగితాల కృష్ణారెడ్డి, నేతృత్వంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఎమ్మెల్యే ప్రతి గడపకూ వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు సంక్షేమ పథకాల వల్ల చేకూరిన లబ్ధికి సంబంధించిన బుక్ లెట్ అందజేశారు.
అలాగే ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకొని,పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నిర్వహించిన పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకొని నవరత్న పథకాలను ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినట్లు చెప్పారు.జాతిపిత మహాత్మగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యామే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ గ్రామ సచివా లయ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు.
కుల,మత, రాజకీయలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా వలంటీర్ వ్యవస్థ ద్వారా నిరుపేదలందరికీ ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని చెప్పారు.పేదల సంక్షేమం కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలనిన్నారు.ఈ కార్యక్రమంలో లావేరు ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ,జెడ్పీటీసీ మీశాల సీతం నాయుడు,ఎంపిటిసి కాగితాల కృష్ణారెడ్డి, వైసీపీ యువ నాయకుడు కొల్లి రమణారెడ్డి,వైసీపీ నాయకులు,చాట్ల రమణ,దల్లి రాజారెడ్డి, బోర శ్రీరామ్ రెడ్డి,బోర రాజారావు,జల్లేపల్లి నారాయణమూర్తి,మండల స్థాయి అధికారులు,సచివాలయ ఉద్యోగులు,గ్రామ వాలంటీర్లు,వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.