SAKSHITHA NEWS

central government is making noise in green Telangana

పచ్చని తెలంగాణలో చిచ్చు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం

సింగరేణి కార్మికులను ద్రోహం చేస్తే ఊరుకునేదే లేదు

ఏమ్మెల్యే కోరుకంటి చందర్

సాక్షిత పెద్దపల్లి బ్యూరో:

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గని కార్మికులను కట్టు బానిసలుగా చేసే దుర్మార్గ చర్య. బొగ్గుబ్లాకుల వేలాన్ని నిరసిస్తూ తాను చేపట్టబోయే సింగరేణి పోరు దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సింగరేణి బొగ్గు బ్లాకుల వేలానికి నిరసనగా ఈనెల 26 న తాను చేపట్టబోయే సింగరేణి పోరుదీక్షకు ప్రజలు, కార్మికవర్గమంతా పార్టీలు, యూనియన్లకతీతంగా మద్దతు తెలిపి, విజయవంతం చేయాలని రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు.

గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిని ప్రైవేటీకరించేందుకు బిజెపి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బొగ్గు బ్లాకులను వేలం వెయ్యొద్దని, రాష్ట్ర ప్రభుత్వానికే కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసినా పెడచెవిన పెట్టిందని విమర్శించారు.

ఇటీవల ఆర్ఎఫ్సిఎల్ ను జాతికి అంకితం చేయడానికి రామగుండంకు వచ్చిన ప్రధాని మోడీ ఎన్టిపిసి బహిరంగ సభలో సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించబోమని నమ్మబలకడంతో కార్మికుల్లో ఆశలు చిగురించాయని, బిజెపి నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారన్నారు. జూటా మాటల మోడీ మాట ఇచ్చి నెల గడవకముందే, ఆయన అనుయాయులు ఆదాని, రాజగోపాల్ రెడ్డిలకు బొగ్గు బ్లాక్ లను కేటాయించడానికి టెండర్ల పేరిట కుట్రపన్నారని, ఆ కుట్రను తిప్పికొట్టడం కోసం ఉద్యమం చేయడానికి గని కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

బొగ్గు బ్లాక్ లను ప్రైవేటుపరం చేస్తే, సింగరేణి గని కార్మికులు కాంట్రాక్టు కార్మికులవుతారని, హక్కులు కోల్పోయి వెట్టిచాకిరికి నెట్టబడతారన్నారు. సింగరేణి సంస్థ కూడా టెండర్లు వేయొచ్చు కదా! అని అవగాహనలేని బీజేపీ నాయకులు వంతపాడుతున్నారని, సింగరేణి కంపెనీ ప్రభుత్వ రంగ సంస్థనా! కాంట్రాక్టు సంస్థనా అని ప్రశ్నించారు. గనులను వేలం వేయడం కోసమే ఎంఎండిఆర్ బిల్లును పార్లమెంటులో పాస్ చేయించారన్నారు. రాజస్థాన్ లో లిగ్నైట్ గనులు, ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్లలో ఉన్న గనులను ఆయా ప్రభుత్వాలకే కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న బొగ్గు గనులకు మాత్రం టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తోందన్నారు.

బొగ్గు బ్లాకులు కాంట్రాక్టర్ల పరమైతే, వారిని తరిమి కొట్టడానికి సైతం కార్మిక వర్గం సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అనేక సంక్షేమ పథకాలతో పచ్చగా ఉన్న తెలంగాణలో బిజెపి కేంద్ర ప్రభుత్వం చిచ్చు పెట్టాలని చూస్తోందని, రాష్ట్రాలకున్న అధికారాలను అణగదొక్కాలని చూస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన అనేక నిధులను కేటాయించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరినా, కేంద్ర ప్రభుత్వం పట్టనట్టు ఉంటోందన్నారు. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలు చేయడానికి, బొగ్గు బ్లాకులను వేలం వేసే పథకం పన్నిన మోడీ ప్రభుత్వానికి, ‘సింగరేణి పోరు దీక్ష’ ద్వారా సమాధానం చెప్పాలని,ఈ దీక్షలో సబ్బండ వర్గాల ప్రజలు,కార్మికులు,కార్మిక నాయకులు,పార్టీలు,యూనియన్లు,రాజకీయాలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చందర్ కోరారు.

ఇంకా ఈ సమావేశంలో నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక రావు, రాష్ట్ర కార్యదర్శి మూల విజయా రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, బిఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పిటి స్వామి, ఐలి శ్రీనివాస్, నారాయణదాసు మారుతి, చెరుకు బుచ్చిరెడ్డి, దీటి బాలరాజు, తానిపర్తి గోపాలరావు, వంగ శ్రీనివాస్ గౌడ్, రఫీక్, పర్లపల్లి రవి, బాల రాజకుమార్, గన్ముకుల తిరుపతి, కల్వల సంజీవ్ చెలుకలపల్లి శ్రీనివాస్, బొడ్డు రవీందర్, జేవి రాజు, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, నీరటి శ్రీనివాస్, అడప శ్రీనివాస్, అనుముల కళావతి, ఇనుముల సత్యం, అల్లం ఐలయ్య, గడ్డం నారాయణ, హమీద్, దాసరి ఎల్లయ్య, సిరాజ్, తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS