News written by journalists should be credible
జర్నలిస్టులు వ్రాసే వార్తలకు విశ్వసనీయత ఉండాలి
రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం
శ్రీకాకుళం: జర్నలిస్టులు వ్రాసే వార్తలకు విశ్వసనీయత ఉంటేనే అక్కడ జర్నలిజం విలువలు పెరుగుతాయని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళా వేదికలో సోమవారం సి. రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఏర్పాటు చేసిన జర్నలిజం మౌలిక సూత్రాలు – విలువలు – ప్రమాణాలుపై జిల్లా జర్నలిస్టులకు ఒక రోజు అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ చైర్మన్ నిబద్ధత, నిజాయితీ, జీవిత కాలం తీసుకుంటూ వచ్చినట్లు చెప్పారు.
ప్రెస్ అకాడమీ అధ్యక్షులు కొమ్మునేని శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల హోదాను పెంచాలనే ఉద్దేశంతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.జర్నలిస్టుల విలువలు పెంచే విధంగా ఉండాలని చెప్పారు. వార్తలు వ్రాసినపుడు నిక్కచ్చిగా ఉండాలన్నారు.
ప్రస్తుతం సమాజంలో ఏమి జరుగుతుందని గమనించి అందుకు తదనుగుణంగా వ్రాయాలన్నారు. జర్నలిస్టుల్లో మార్పు రావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవాలు వ్రాస్తే సంతృప్తినిస్తుందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య పథకం, తదితర సమస్యలు గూర్చి చర్చించారు. నిజమైన జర్నలిస్టులకు న్యాయం జరగాలన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ మీడియాకు ఒక ప్రత్యేకత ఉన్నదన్నారు. మీడియాకు ప్రభుత్వం నుండి సహాయ సహకారం ఉండాలని చెప్పారు. ఈ అవగాహన సదస్సు జర్నలిస్టులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్, ప్రెస్ అకాడమీ కార్యదర్శి యం.
బాలగంగాధర్ తిలక్, జర్నలిస్టుల సంఘాలు, ఆయా మండలాల జర్నలిస్టులు,తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మునేని శ్రీనివాసరావుని ఘనంగా సత్కరించారు.సమావేశానికి హాజరైన జర్నలిస్టులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.