A.P.S.B.C.Y.L. performing with black badges. Porters
నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన చేస్తున్న ఎ.పి.యస్.బి.సి.యల్. హమాలీలు
హమాలీల JIC ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు శనివారం కూలిరేటు పెంచాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
విజయవాడ గ్రామీణ గొల్లపూడి: IMFL (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్)లో లోడింగ్, అన్లో డింగ్ హమాలీల కూలి పెంచాలని ఏ.ఐ.టీ.యు.సీ నాయకుడు వెంకటసుబ్బయ్య విజయవాడ గొల్లపూడి వన్ ఐ ఎం ఎఫ్ఎల్ డిపో ఎదుట నిరసన ఎగమతి కూలీ రేటు ఓప్పందం 05-01-2021 తేదీన సిగ్మా కంపెనీ కాంట్రాక్టర్‌తో, ఎ.పి.యస్.బి.సి.యల్. అధికారుల సమక్షంలో అగ్రిమెంటు జరిగినది. అగ్రిమెంటు కాల పరిమితి 31-10-2021 నాటికి ముగిసినది. 01-11-2021 నుండి కొత్త కూలీ రేటు అమలు జరగాల్సి వుంది. పెరిగిన ఇంటి అద్దెలు, వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, నిత్యావసరాల వస్తువుల ధరలకు అనుగుణంగా ఎగుమతి కూలీ రేటు సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పెంచాలని, ఈఎస్ఐ, పీఎఫ్, గుర్తింపు కార్డులు మంజూరు చేయా లన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని, లేకుంటే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఏ ఐ టీ యూ సీ నాయకులు ఎ.పి.యస్.బి.సి.యల్. హమాలీ కార్మికులు సురేంద్ర, సదయ్య, స్టీఫెన్, హరీష్, రవి, రాజు, రాజేష్, పవన్, సదానందం, AITUC సంఘం నాయకులు వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.