Former MLA Koona Srisailam Goud visited Dulapalli Tummar Pond
దూలపల్లి తుమ్మర్ చెరువును సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..
సాక్షిత : కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి తుమ్మర్ చెరువులో గుఱ్ఱపు డెక్క, డ్రైనేజీ వ్యర్థాలతో పేరుకుపోయి భూగర్భ జలాలు కలుషితమయి త్రాగునీరు దుర్వాసన రావడంతో స్థానిక బీజేపీ నేతలు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకురావడంతో ఆయన స్థానికులతో కలిసి చెరువును సందర్శించారు.
చెరువులో పూర్తిగా నిండిపోయిన గుఱ్ఱపు డెక్క, డ్రైనేజ్ వ్యర్థాలు, తూము కాలువ ఆక్రమణలను పరిశీలించారు.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ మైసమ్మ గూడ లోని పలు ఇంజనీరింగ్ కళాశాలల, పలు లే ఔట్ల నుండి వెలువడే డ్రైనేజ్ నీరు వచ్చి చెరువులో నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుంది అన్నారు.
స్థానిక ఎమ్మెల్యేకి, కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్, చైర్మన్ లకు స్థానిక బీజేపీ నేతలు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఎమ్మెల్యే, కొంపల్లి మున్సిపల్ కమిషనర్ దూలపల్లి చెరువును సందర్శించి, సమస్యను పరిష్కరించకపొతే మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు
.
ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, రమేష్, అశోక్, నర్సింహా, కుమార్ గౌడ్, శ్రీకాంత్, నర్సింగా రావ్, శ్రీనాథ్ గౌడ్, దుర్గా తదితర నాయకులు పాల్గొన్నారు.