SAKSHITHA NEWS


Check for traffic problems with master plan roads – Commissioner Anupama

మాస్టర్ ప్లాన్ రోడ్లతోనే ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ – కమిషనర్ అనుపమ


సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మాష్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు.


మాస్టర్ ప్లాన్ రోడ్డు పనుల పురోగతిని శుక్రవారం ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయన్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి మాస్టర్ ప్లాన్ రోడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

సుమారు 12 రోడ్లను గుర్తించి పనులు వేగవంతం చేశామన్నారు. తమ సిబ్బంది ఇప్పటికే సర్వే చేసి, స్థలాలు కోల్పోయే వారికి టిడిఆర్ బాండ్లు కూడా ఇస్తున్నామన్నారు. ఏదైనా నగరం అభివృద్ధి చెందాలంటే రోడ్ల కనెక్టివిటీ ఉంటేనే సాధ్యమన్నారు. ఎక్కువ ఇబ్బందులు లేని రోడ్లను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు.

భూమి కోల్పోయే వారికి ఇంకా కొంతమందికి బాండ్లు ఇవ్వాల్సి ఉందని, ఆ రోడ్ల పనులు కూడా వేగవంతం చేస్తామన్నారు.
కమిషనర్ వెంట అదనపు కమిషనర్ సునీత, ఏసిపి బాల సుబ్రమణ్యం, సర్వేయర్లు దేవేంద్ర, మురళీకృష్ణ, ప్లానింగ్, అమెనిటీ సెక్రటరీ లు ఉన్నారు.


SAKSHITHA NEWS