SAKSHITHA NEWS

TDP Ayyannapatra has condemned the illegal arrest

image 25

టీడీపి అయ్యన్నపాత్రుడు అక్రమ అరెస్టును ఖండించిన – చిత్తూరు పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు -షణ్ముగం రెడ్డి

పుత్తూరు లో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తు నిరసనలు

తిరుపతి జిల్లా, పుత్తూరు:

ఏపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడుని నిన్న అర్ధరాత్రి అక్రమ అరెస్టును నిరసిస్తూ పుత్తూరు లో నగరి నియోజకవర్గం ఇంచార్జి గాలి భానుప్రకాష్ ఆదేశాల మేరకు చిత్తూరు పార్లమెంటరీ బి సి సెల్ నాయకులు షణ్ముగం రెడ్డి ఆధ్వర్యంలో నలుపు కండువాళ్ళతో వైసీపీ ప్రభుత్వ తీరును బట్టి నినాదాలు చేస్తూ,భారీ నిరసనల కార్యక్రమము నిర్వహించారు.

అయ్యన్న పాత్రుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కార్వేటినగరం రోడ్డు కూడలిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.

అక్రమంగా అరెస్టు చేసిన అయ్యన్నపాత్రుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం, సిఐడి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు .

ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దౌర్జన్యాలు చేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నారు

వైసిపి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని,అన్న క్యాంటీన్లపై వైసిపి దౌర్జన్యం సరికాదు అన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పుత్తూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు జీవరత్నంనాయుడు,ప్రధాన కార్యదర్శి ఎన్.ఎన్.ధనపాల్, రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు డి.ఎస్.గణేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ యుగంధర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆనంద్, సీనియర్ నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS