ఓటు వేసిన పాల్వాయి స్రవంతి, కూసుకుంట్ల

Spread the love
Voted by Palvai Sravanti, Kusukuntla
ఓటు వేసిన పాల్వాయి స్రవంతి, కూసుకుంట్ల

మునుగోడులో ప్రారంభమైన పోలింగ్‌


మునుగోడు: తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియలో సాయంత్రం 6 గంటల వరకు ఓటర్ల తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఓటర్లు ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్నారు. 


మొత్తం ఏడు మండలాల్లో 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. తెరాస, భాజపా, కాంగ్రెస్‌, బీఎస్పీ, తెజసతోపాటు వివిధ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 47 మంది బరిలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్ ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు.
Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page