SAKSHITHA NEWS

జూరాలకు భారీ వరద.. 32 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్‌: జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకు 1.75 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 32 గేట్లను ఎత్తివేశారు.

ప్రస్తుతం ప్రాజెక్టుకు నుంచి 1.56 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ఇప్పుడు 317.826 మీటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది. జూరాల పూర్తి నీటినిల్వ 9.65 టీఎంసీలుకాగా ఇప్పుడు 8.869 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.


SAKSHITHA NEWS