నూతన పెన్షన్ కార్డులను మరియు సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ..
మహబూబాబాద్ నియోజకవర్గం గూడూరు మండల పరిధిలోని మట్టవడా ,ఊట్ల , ఎర్రకుంటా తండా , హనుమాన్ తండా , మర్రిమిట్టా , మరియు గూడూరు మండల కేంద్రానికి చెందిన 316 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు కార్డులను అందజేసిన మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ..
ఈ సందర్భంగా ఎమ్మేల్యే బానోత్ శంకర్ నాయక్ గారు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గొప్ప సాహసం దాతృత్వం కూడిన ఆలోచన 50 లక్షల మంది అభాగ్యులైన వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఒంటరి మహిళలలకు ఆసరా పెంక్షన్లను అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు ..
పింఛన్ రానివారు అదైర్యపడవద్దని అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్స్ వస్తాయని అప్లై చేసుకొని వారు ఉంటే చేసుకోవాలని ఎమ్మెల్యే గారు సూచించారు.
అనంతరం గూడూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 21 మంది లబ్ధిదారులకు మంజూరైన 6,27,000 రూ . సీఎం సహాయనిది చెక్కులను మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ..
ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్య శ్రీ పథకం. వర్తించని వ్యాదులకు, పేదలను ఆదుకోవడం కోసం సిఎం కెసిఆర్ లక్షల రూపాయలను మంజూరు. చేస్తున్నారని ఎమ్మెల్యే జునోత్ శంకర్ నాయక్ తెలిపారు ..
సిఎం రిలీప్ ఫండ్ చెక్కులను మంజూరు చేసిన సిఎం కెసిఆర్ కి ఎమ్మెలే బానోత్ శంకర్ నాయక్ కి ధన్యవాదాలు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ సుజాత మోతిలాల్ , జడ్పీ కో అప్సన్ ఎండి ఖాసీం , వైస్ ఎంపీపీ అరె వీరన్న , పిఏసీఎస్ చైర్మన్ లింగ రెడ్డి , మండల అధ్యక్ష కార్యదర్శులు వెంకటకృష్ణ రెడ్డి , నుకాల సురేందర్ , కో అప్సన్ రహీం , మహిళ నాయకురాలు సమ్మక్క , సీనియర్ నాయకులు సంపత్ రావు , కటర్ సింగ్ , చిదురీ వెంకన్న , స్థానిక సర్పంచులు , ఎంపీటీసీలు , వివిధ హోదలో ఉన్న చైర్మన్ , వైస్ చైర్మన్లు , అధికారులు, తెరాస ముఖ్యనాయకులు , ఆసరా పెన్షన్ లబ్ధిదారులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు. .