స్పందన” అర్జీలను సకాలంలో పరిష్కరించాలి – తిరుపతి జిల్లా కలెక్టర్
సాక్షిత, తిరుపతి బ్యూరో: స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమoలో జాయింట్ కలెక్టర్ బాలాజీ, డి.ఆర్.ఓ శ్రీనివాస రావు పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీ దారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం అర్జీలు 91 రాగా, ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 65 , పంచాయితీ రాజ్ శాఖ కు సంబంధించి 8, డి.సి.హెచ్.ఎస్ కు సంబంధించి 1, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంబంధించి 3, పోలీస్ శాఖ కు సంబంధించి 1, బి.సి సంక్షేమ శాఖ కు సంబందించి 1, గురుకుల పాఠశాలకు సంబందించి 9, మైనారిటీ శాఖ కు సంబంధించి 1, తుడా 1, ఎస్.ఈ ట్రాన్స్కో కు సంబందించి 1 అర్జీలు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్క రించాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబందించిన అధికారులు పాల్గొన్నారు.
స్పందన” అర్జీలను సకాలంలో పరిష్కరించాలి – తిరుపతి జిల్లా కలెక్టర్
Related Posts
ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్..
SAKSHITHA NEWS ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్.. అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది.. సాయంత్రం 4.00…
లేని వాలంటీర్లకు వేతనాలు ఎలా?: మంత్రి డోలా
SAKSHITHA NEWS లేని వాలంటీర్లకు వేతనాలు ఎలా?: మంత్రి డోలా అమరావతి: వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘వాలంటీర్లను వైకాపా…