SAKSHITHA NEWS

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పురస్కరించుకుని దేశభక్తిని జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా ముగ్గుల పోటీలు

వజ్రోత్సవ వేళ కదం తొక్కిన మహిళలు

జాతీయ సమైక్యతను, దేశ ఔన్నత్యం చాటుతూ సాగిన ముగ్గుల పోటీలు

………..

సాక్షిత : సైదాపూర్ మండలం హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లా

హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మరియు మండల పరిషత్ కార్యాలయంలో దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్.

ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విదేశీ బానిస సంకెళ్లు తెంచుకొని యావత్ భారతవణి స్వేచ్ఛ వాయువులు పిలుస్తూ 75 ఏళ్ళు గడుస్తున్న శుభ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా 15 రోజులగా సంబరాలు,దేశ భక్తి పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశించారని అన్నారు.
అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజు వారీగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉవ్వెత్తున కొనసాగుతున్నాయని,
ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర్య స్ఫూర్తి చాటేలా,జాతీయ దృక్పథంతో ఎందరో అమరులు చేసిన త్యాగాలు స్మరిస్తూ వజ్రోత్సవాల వేడుకలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రభుత్వ పథకాలు పేదల దరికి చేరినప్పుడే స్వాతంత్ర్య ఫలాలు అందినట్లు అని భావిస్తూ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్ర ప్రజల చిరునవ్వుకు కారణం అవుతున్నారన్నారు.


SAKSHITHA NEWS