ఆగస్టు 21 : ప్రపంచ వయో వృద్దుల దినోత్సవం 2022 వృద్ధులు మరియు వారి ఆరోగ్యం – డా. అఫ్తాబ్ అహ్మద్ సీనియర్ కన్సల్టెంట్ వైద్యుడు, అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్.
సాక్షిత : వృద్ధులు మరియు వారి ఆరోగ్యం
దేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతున్నది. వృద్ధులు ఎక్కువగా వారి ఆరోగ్యాన్ని మరియు జీవన నాణ్యతను ప్రభావితం చేసే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. వృద్ధులు ఉండే కుటుంబాలు తగిన సన్నద్దతతో ఉండాలి మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఈ వృద్ధాప్య సమస్యలకు మద్దతు అందించడంతో పాటు తగిన శ్రద్ధ వహించాలి.
వృద్ధులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను విస్తృత దృష్టితో చూడాల్సి ఉంటుంది, వృద్దాప్యం కారణంగా వృద్దులలో కంటిచూపు మందగించడం, వినికిడి లోపం కలగడం, ఆలోచనల పరిజ్ఞానం లోపించడం, చురుకుగా కదలలేక పోవడం లేదా వయస్సు రీత్యా రోగనిరోధక పనితీరులో క్షీణత రావడం వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. కొన్నిసార్లు, ఆర్థరైటిస్, మూత్రపిండాల వ్యాధి, మూత్ర సమస్యలు, చిత్తవైకల్యం, హృదయ సంబంధమైన వ్యాధులు, స్ట్రోక్, మధుమేహం మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక పరిస్థితులు కూడా వృద్దాప్యపు వయస్సులోనే ఎక్కువగా ప్రభావితమయ్యే ఆవకాశం ఉంది.
కుటుంబాలు తమ ఇంటిలో ఉన్న వృద్దులైన రోగుల పట్ల తగిన శ్రద్ధను కనపరచడం చాలా ముఖ్యం మరియు వారి దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులకు తగిన చికిత్స అందించడానికి మరియు వృద్దులు ఆరోగ్య లక్ష్యాలను సాధించేలా వారితో కలిసి హాస్పిటల్స్‌ను క్రమం తప్పకుండా సందర్శించడాన్ని కొనసాగించడం కూడా ముఖ్యం. ఇది వృద్దులలో సహేతుకమైన మరియు మంచి జీవన నాణ్యతను పెంపొందించేందుకు దారితీస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు, తగిన ఆరోగ్య సంరక్షణను అందుకోవడం ద్వారా వృద్ధులు ఉత్తమమైన ప్రయోజనం పొందగలుగుతారు, ఇది వృద్ధులలో ఉండే ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణుల ద్వారా వారి సమస్యలను నివారించడం మరియు నిర్వహించడం వైపు దృష్టి సారించాలి.
వృద్ధులకు ఆరోగ్య చిట్కాలు
- ఆరోగ్యకరమైన సమతులమైన ఆహారం తీసుకోండి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ చురుకుగా ఉండండి.
- మీ కంటి దృష్టిని క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోండి మరియు దోషం ఉంటే సరిదిద్దండి.
- ఎముకలు మరియు కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి
- వినికిడి లోపాలు ఉంటే వైద్య సహాయంతో సరిదిద్దుకోండి
- మీకు ఉన్న ఆరోగ్య సమస్యల కోసం క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి మరియు కనీసం ఏడాదికి ఒక సారైన ఆరోగ్య తనిఖీలు చేయించుకోండి
- రెగ్యులర్‌గా మందులు మరియు నివారణ టీకాలు (ఫ్లూ, న్యుమోకాకల్, జోస్టర్) వంటివి వేయించుకోండి
డా. అఫ్తాబ్ అహ్మద్
సీనియర్ కన్సల్టెంట్ వైద్యుడు,
అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్.
మరింత సమాచారానికి దయ చేసి సంప్రదించండి: 9959154371 / 9963980259